విడుదలకు రెడీ అవుతోన్న 'తుంటరి'

  • IndiaGlitz, [Saturday,January 02 2016]

కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ ప్రొడ‌క్ష‌న్ నెం.2లో నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం 'తుంట‌రి'. బాణం, సోలో, సారొచ్చారు, ప్ర‌తినిధి, రౌడీఫెలో వంటి సినిమాల‌తో త‌న‌దైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్‌. తాజాగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ లో ఆయ‌న న‌టిస్తున్న తుంటరి' చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

సినిమాను ఫిభ్రవరి మొదటివారంలో కానీ జనవరి చివరి వారంలో విడుదల చేయాలనుకుంటున్నటు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ క‌థ‌ను అందించిన సినిమా ఇది. నారా రోహిత్ ప‌క్క‌న ల‌తా హెగ్దే నాయిక‌గా న‌టిస్తోంది. గుండెల్లో గోదారి ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అశోక్ బాబా, నాగార్జున్ నిర్మాత‌లు. దసరా సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్ న్యూ లుక్‌తో క‌నిపిస్తారు. ఈ సినిమా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కుతున్న‌ట్టు చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరాః ఎం.ఆర్‌.ప‌ళ‌ని కుమార్‌, మ్యూజిక్ః సాయికార్తీక్‌, ఎడిట‌ర్ః త‌మ్మిరాజు, ఆర్ట్ః ముర‌ళి కొండేటి, స్టంట్స్ః వెంక‌ట్‌, కొరియోగ్ర‌ఫీః బాబా భాస్క‌ర్‌, నిర్మాత‌లుః అశోక్ బాబా, నాగార్జున్‌, ద‌ర్శ‌క‌త్వంః కుమార్ నాగేంద్ర‌.

More News

'కథకళి' రిలీజ్ డేట్...

పందెంకోడి,పొగరు,భరణి,ఇంద్రుడు,పూజ,జయసూర్య వంటి మాస్ కమర్షియల్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన మాస్ హీరో విశాల్

నిర్మాతలుగా మారుతున్న మహేష్ డిస్ట్రిబ్యూటర్స్

శ్రీమంతుడు,రుద్రమదేవి,నాన్నకు ప్రేమతో సహా పలు విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్ త్వరలోనే నిర్మాతలుగా మారుతున్నారు.

నాలోని న‌టుడ్ని బ‌య‌ట‌కు తీసిన‌ స్పీడున్నోడు అంద‌రికీ న‌చ్చుతుంది అని నా న‌మ్మ‌కం. - హీరో బెల్లంకొండ శ్రీనివాస్

అల్లుడు శీను చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై..తొలి చిత్రంతోనే విజయం సాధించిన యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. భీమ‌నేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ స్పీడున్నోడు

పోలీస్ గెటప్ లో ప్రభాస్...

బాహుబలి కన్ క్లూజన్ చిత్రీకరణతో బిజీ అవుతున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేసేయాలనుకుంటున్నాడు.

డిక్టేటర్ శాటిలైట్ రైట్స్ ను...

బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్,వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ రూపొందిస్తున్న చిత్రం డిక్టేటర్.