close
Choose your channels

'కథకళి' రిలీజ్ డేట్...

Saturday, January 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి మాస్‌ కమర్షియల్‌ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసిన మాస్‌ హీరో విశాల్‌ తాజాగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పాండ్యరాజ్‌ దర్శకత్వంలో విశాల్‌ నిర్మిస్తున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ కథకళి`. అన్ని కార్యక్రమాు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 14న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతోంది.

ఈ సందర్భంగా..

హీరో, నిర్మాత విశాల్‌ మాట్లాడుతూ నా కెరీర్‌లో మరో డిఫరెంట్‌ కమర్షియల్‌ మూవీ కథకళి`. డైరెక్టర్‌ పాండిరాజ్‌ ఈ కథను చాలా అద్భుతంగా డీల్‌ చేశారు. ఫుల్‌ లెంగ్త్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో నాకు మళ్ళీ మరో హిట్‌ సినిమా అవుతుంది. జనవరి 14న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం`` అన్నారు.

మాస్‌ హీరో విశాల్‌ సరసన కేథరిన్‌ త్రెస, రెజీనా కసాండ్రా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్‌, కరుణాస్‌, శత్రు, సూరి, శ్రీజిత్‌ రవి, పవన్‌, మైమ్‌ గోపీ, మధుసూదన్‌రావు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాసుబ్రమణ్యం, సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, ఎడిటింగ్‌: ప్రదీప్‌ ఇ.రాఘవ్‌, మాటు: శశాంక్‌ వెన్నెల కంటి, ఫైట్స్‌: అనల్‌ అరసు, పాటు: వెన్నెకంటి, భువనచంద్ర, నిర్మాత: విశాల్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాండ్యరాజ్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.