ఈ వారం కూడా కొనసాగిస్తారా?

  • IndiaGlitz, [Tuesday,February 13 2018]

తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ లేనంతగా ఈ ఫిబ్రవరి నెలలో ప్రతీ వారం కొత్త దర్శకుల సినిమాలు విడుదల అవుతుండ‌డం విశేషం. ఈ నెలలో గడచిన ఈ పది రోజుల్లో టచ్ చేసి చూడు', ఛలో', గాయత్రి', ఇంటెలిజెంట్', తొలిప్రేమ' వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో టచ్ చేసి చూడు', ఛలో', తొలిప్రేమ' సినిమాలు.. కొత్త దర్శకులు విక్రమ్ సిరికొండ, వెంకీ కుడుముల, వెంకి అట్లూరి తెరకెక్కించినవే కావ‌డం గ‌మ‌నార్హం .

ఇందులో టచ్ చేసి చూడు' ఆశించిన మేర విజయం సాధించకపోయినా.. ఛలో', తొలిప్రేమ' సినిమాలు మాత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద వ‌సూళ్ళ సందడి చేస్తున్నాయి. ఇక ఈ వారంలో భారీ అంచనాల మధ్య విడుదల కానున్న మూడు చిత్రాలు ఇది నా లవ్ స్టోరీ' (రమేష్ గోపి – దర్శకులు), అ!' (ప్రశాంత్ వర్మ – దర్శకుడు), మనసుకు నచ్చింది (మంజుల – దర్శకురాలు) కూడా కొత్త దర్శకులు రూపొందించిన‌వే కావ‌డం విశేషం. వీటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే.. మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

More News

'శివకాశీపురం' ఆడియో లాంచ్!!

సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు రాజేశ్ శ్రీ చక్రవర్తి కథానాయకుడిగా పరిచయం చేస్తూ సాయి హరేశ్వర ప్రొడక్షన్స్ పై

రాజ్ కందుకూరి చేతుల మీదుగా స్పా స్టూడియో ప్రారంభం

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈరొజు బంజారా హిల్ల్స్ లొ సావెజ్ అనె ఒక స్పా అండ్ సెలూన్ స్టూడియొని ప్రారంభించారు. ఈ వెడుకలొ ఆయనతొ పాటు ఒక అనాధ శరణాలయం నుంచి బాల బాలికలు కూడా అతిధులుగా పాల్గొన్నారు.

చిత్రీకరణ పూర్తిచేసుకున్న చంద్ర సిద్ధార్థ్ చిత్రం

సందేశాత్మక చిత్రాలతో భిన్నమైన కథలను తెరకెక్కించడంలో ముందు వరుసలో ఉంటారు దర్శకుడు చంద్ర సిద్ధార్థ్.

ఉగాది నుంచి ఎన్టీఆర్ బ‌యోపిక్‌?

గత ఏడాది కాలంగా అలుపన్నది లేకుండా వరుస సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా గడిపారు నందమూరి నటసింహం బాలకృష్ణ. వరుసగా 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'పైసా వసూల్', 'జై సింహా' సినిమా షూటింగ్ లలో పాల్గొని.. నేటి యువ కథానాయకులకు ఛాలెంజ్ విసిరారు బాలయ్య. 'జై సింహా' తర్వాత ఆకట్టుకునే కథలు ఆయన వద్దకు రాకపోవడంతో.. కొంత విశ్రాంతి తీసుకుని నేరుగా ఎన్టీఆర్ బయోపిక్&#

సామ్ , చైతు చిత్రాన్ని నిర్మించనున్న నాని నిర్మాతలు

ఆ జంటను చూసి పులకించడం వెండితెర వంతైతే..వెండితెర పై ఆ జంట కెమిస్ట్రీ చూసి పరవశించడం ప్రేక్షకుల వంతు.‘ఏ మాయ చేశావే’,‘మనం’,‘ఆటోనగర్ సూర్య’ సినిమాలతో ప్రేక్షకులకు కనువిందు చేసిన ఆ జంట..