close
Choose your channels

ఈ వారం కూడా కొనసాగిస్తారా?

Tuesday, February 13, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ లేనంతగా ఈ ఫిబ్రవరి నెలలో ప్రతీ వారం కొత్త దర్శకుల సినిమాలు విడుదల అవుతుండ‌డం విశేషం. ఈ నెలలో గడచిన ఈ పది రోజుల్లో టచ్ చేసి చూడు`, ఛలో`, గాయత్రి`, ఇంటెలిజెంట్`, తొలిప్రేమ` వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో టచ్ చేసి చూడు`, ఛలో`, తొలిప్రేమ` సినిమాలు.. కొత్త దర్శకులు విక్రమ్ సిరికొండ, వెంకీ కుడుముల, వెంకి అట్లూరి తెరకెక్కించినవే కావ‌డం గ‌మ‌నార్హం .

ఇందులో టచ్ చేసి చూడు` ఆశించిన మేర విజయం సాధించకపోయినా.. ఛలో`, తొలిప్రేమ` సినిమాలు మాత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద వ‌సూళ్ళ సందడి చేస్తున్నాయి. ఇక ఈ వారంలో భారీ అంచనాల మధ్య విడుదల కానున్న మూడు చిత్రాలు ఇది నా లవ్ స్టోరీ` (రమేష్ గోపి – దర్శకులు), అ!` (ప్రశాంత్ వర్మ – దర్శకుడు), మనసుకు నచ్చింది (మంజుల – దర్శకురాలు) కూడా కొత్త దర్శకులు రూపొందించిన‌వే కావ‌డం విశేషం. వీటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే.. మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.