రామ్ చ‌ర‌ణ్ మూవీలో విల‌న్ గా న‌టిస్తున్న హీరో..?

  • IndiaGlitz, [Tuesday,September 22 2015]

రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో దానయ్య ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.ద‌స‌రా కానుక‌గా బ్రూస్ లీ చిత్రాన్ని అక్టోబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. అయితే బ్రూస్ లీ చిత్రం త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ త‌మిళ చిత్రం త‌ని ఒరువ‌న్ రీమేక్ లో న‌టించ‌నున్నారు. ఈ సినిమాలో చ‌ర‌ణ్ పోలీసాఫీర్ గా క‌నిపిస్తారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...ఈ చిత్రంలో విల‌న్ రోల్ ను రానాతో చేయిస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌. రామ్ చ‌ర‌ణ్‌, రానా ఇద్ద‌రు మంచి స్నేహితులు. క‌నుక రామ్ చ‌ర‌ణ్ అడిగితే రానా విల‌న్ పాత్ర చేసే అవ‌కాశం ఉంది. అదే క‌నుక జ‌రిగితే...బాహుబ‌లి త‌ర్వాత రానా విల‌న్ గా న‌టిస్తున్న ఈ సినిమాకి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం. త‌ని ఒరువ‌న్ చిత్ర ద‌ర్శ‌కుడు జ‌యం రాజానే తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది.మ‌రి..రామ్ చ‌ర‌ణ్ మూవీలో రానా న‌టిస్తున్నారా..? లేదా..? అనేది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

'కంచె' వాయిదా పడింది

కంచె విడుదల వాయిదా పడింది.అక్టోబర్ 2కు బదులు ఈ సినిమాను నవంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రామ్ డబ్బింగ్

రామ్ ప్రస్తుతం తన సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు.

'పనిలేని పులిరాజు' పంచ్ పోస్టర్ విడుదల

ధన రాజ్ హీరోగా పాలేపు మీడియా ప్రై.లి బ్యానర్ పై పి.వి.నాగేష్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'పనిలేని పులిరాజు'. ఈ చిత్రానికి చాచా దర్శకుడు.

హరీష్ దర్శకత్వంలో పవన్?

హరీష్ శంకర్ పేరు చెప్పగానే గబ్బర్ సింగ్ సినిమా గుర్తుకొస్తుంది.

24న బ్రూస్ లీ సాంగ్ టీజర్

రామ్ చరణ్ నటిస్తున్న సినిమా బ్రూస్ లీ. సినిమా పేరు నుంచి, టీమ్ చెప్పే విషయాలు, చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ వరకు ఈ సినిమాలో చాలా విశేషాలే ఉన్నాయి.