close
Choose your channels

హరీష్ దర్శకత్వంలో పవన్?

Tuesday, September 22, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హరీష్ శంకర్ పేరు చెప్పగానే గబ్బర్ సింగ్ సినిమా గుర్తుకొస్తుంది. షాక్ తో తెలుగు తెరకు పరిచయమైన ఈ దర్శకుడు మిరపకాయ్ తో మరలా మెగాఫోన్ పట్టినా ఆయనకు పేరు తెచ్చి పెట్టిన సినిమా మాత్రం గబ్బర్ సింగ్. పవన్ కల్యాణ్- హరీష్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంత గొప్పది.

సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా పనులను పూర్తి చేసిన హరీష్ పవన్ కోసం ఓ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. దిల్ రాజు సంస్థలో తాను మరో సినిమా చేయబోతున్నట్టూ ప్రకటించారు. ఆల్రెడీ దిల్ రాజుకు సినిమా చేయడానికి పవన్ కల్యాణ్ సిగ్నల్ ఇచ్చిన సంగతిని దిల్ రాజే ఈ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటన్నిటినీ బట్టి చూస్తే పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమాను నిర్మించనున్నారన్నది న్యూస్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.