పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై మరమ్మతులు.. ట్రాఫిక్ ఆంక్షలు

  • IndiaGlitz, [Friday,April 19 2019]

హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచిన పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై మరమ్మతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 22 నుంచి ఒక వైపు రోడ్డును పూర్తిగా మూసేస్తున్నారు. శంషాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే మార్గంలో రోడ్డు మరమ్మతు పనులను చేపడుతుండడంతో ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రస్తుతం ఉన్న రోడ్డును తొలిగించి బీటీ(బ్లాక్ టాప్) రోడ్డును వేస్తున్నారు. దీంతో ఈ పనులు పూర్తయ్యే వరకు ఒక వైపుగా శంషాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే మార్గాన్ని పూర్తిగా బంద్ చేస్తున్నామని.. దీంతో వాహనదారులు ఈ ఆంక్షలను పరిశీలించుకుని ప్రయాణం సాగించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం.విజయ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఆంక్షలు ఇవీ...

1:- విమానాశ్రయం, శంషాబాద్ నుంచి వచ్చే వాహనదారులు పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ర్యాంపు ఎక్కకుండా అరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్ రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలీ, మెహిదీపట్నం మీదుగా నగరంలోకి వెళ్లాల్సి ఉంది.

2:- చాంద్రాయణగుట్ట, జూ పార్క్‌రోడ్డు, శివరాంపల్లి నుంచి వచ్చే వాహనదారులు మెహిదీపట్నం, హైదరాబాద్ వైపు రావాలంటే పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కింద నుంచి శివరాంపల్లి, పీడీపీ ఎక్స్ రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలీ, మెహిదీపట్నంకు చేరుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

More News

చ‌ర‌ణ్ డ‌బ్బింగ్‌...

అదేంటి చ‌ర‌ణ్ ఇప్పుడు ఏ సినిమా చేయ‌డం లేదు క‌దా! మ‌రెందుకు డ‌బ్బింగ్ చెబుతున్నాడ‌నే సందేహం రావ‌చ్చు. అయితే అస‌లు విష‌య‌మేమంటే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్

స్వాతి రీ ఎంట్రీ

క‌ల‌ర్స్ ప్రోగ్రాంతో పాపుల‌ర్ అయిన స్వాతి.. త‌ర్వాత సినిమాల్లో న‌టిగా, సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది.

నాని బ్రిలియంట్ ఫెర్ఫామెన్స్.. గౌతమ్ హ్యాట్సాప్: ఎన్టీఆర్

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్-19న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది.

శర్వా స్కూబా డైవింగ్

యువ కథానాయుకుడు శర్వానంద్ ఇప్పుడు తమిళ నుండి తెలుగులోకి రీమేక్ అ

బ‌న్ని సినిమాలో మ‌ల‌యాళ నటుడు

ఇప్ప‌డు తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. ప‌ర భాషా న‌టులు తెలుగులో న‌టించ‌డానికి ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు.