అంచనాలను పెంచేస్తున్న అ..ఆ ట్రైలర్..

  • IndiaGlitz, [Tuesday,May 03 2016]

యువ క‌థానాయ‌కుడు నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తొలిసారి క‌ల‌యిక‌లో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అ ఆ. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మించారు. అ ఆ ట్రైల‌ర్ ను నితిన్ - స‌మంత జంట‌గా రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ లో నితిన్ స‌మంత తో... ల‌వ్ చేసేంత ల‌గ్జ‌రీ లేదు...వ‌దిలేసంత లెవ‌లు లేదు..అంటూ చెప్ప‌డం...అలాగే స‌మంత ఈ క‌థ గురించి చెప్పాలంటే...బిగినింగ్.. ట్విస్ట్.. ఎండింగ్..అంటూ చెప్ప‌డంలో త్రివిక్ర‌మ్ మార్క్ క‌నిపిస్తుంది.
ఈ చిత్రం గురించి త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ... మ‌న మూలాల్నిగుర్తు చేసుకునే ప్ర‌య‌త్న‌మే అ ఆ అని చెప్పారు. త్రివిక్ర‌మ్ మాట‌లు..ట్రైల‌ర్ చూస్తుంటే.. అ ఆ కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ మ‌రో మంచి సినిమా...ఖ‌చ్చితంగా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది అనిపిస్తుంది. మ‌రి..అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు అ ఆ ఎంత‌టి విజ‌యాన్ని సాధిస్తుంది అనేది తెలియాలంటే ఈ నెల 27 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

కామెంట్ చేసే వాళ్లకు జోక్ లా అనిపించవచ్చు. కానీ...అలా చేయడం నాలో మరింత బాధ్యతను పెంచింది - సాయిధరమ్ తేజ్

రేయ్,పిల్లా నువ్వులేని జీవితం,సుబ్రమణ్యం ఫర్ సేల్..చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్.పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం సుప్రీమ్.

బాలయ్య సినిమాలో బాలీవుడ్ నటుడు...

నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ మూవీగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో

భారతదేశంలో నితిన్ పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను - పవన్ కళ్యాణ్

యువ కథానాయకుడు నితిన్ -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అ ఆ.ఈ చిత్రంలో నితిన్ సరసన సమంత నటించింది.

శృతిహాసన్‌, తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విడుదల చేస్తున్న విశాల్‌ 'రాయుడు' టీజర్‌

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా, శ్రీదివ్య కథానాయికగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రేపు(3 మే) ఉదయం 10 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను గ్లామర

పెళ్లిపై పూనమ్ బాజ్వా స్పందన...

బాస్,పరుగు చిత్రాలతో తెలుగులో హీరోయిన్ గా కాస్త పేరు తెచ్చుకున్న పూనం బాజ్వా,సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని సమాచారం.