close
Choose your channels

అంచనాలను పెంచేస్తున్న అ..ఆ ట్రైలర్..

Tuesday, May 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువ క‌థానాయ‌కుడు నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తొలిసారి క‌ల‌యిక‌లో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అ ఆ. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మించారు. అ ఆ ట్రైల‌ర్ ను నితిన్ - స‌మంత జంట‌గా రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ లో నితిన్ స‌మంత తో... ల‌వ్ చేసేంత ల‌గ్జ‌రీ లేదు...వ‌దిలేసంత లెవ‌లు లేదు..అంటూ చెప్ప‌డం...అలాగే స‌మంత ఈ క‌థ గురించి చెప్పాలంటే...బిగినింగ్.. ట్విస్ట్.. ఎండింగ్..అంటూ చెప్ప‌డంలో త్రివిక్ర‌మ్ మార్క్ క‌నిపిస్తుంది.
ఈ చిత్రం గురించి త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ... మ‌న మూలాల్నిగుర్తు చేసుకునే ప్ర‌య‌త్న‌మే అ ఆ అని చెప్పారు. త్రివిక్ర‌మ్ మాట‌లు..ట్రైల‌ర్ చూస్తుంటే.. అ ఆ కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ మ‌రో మంచి సినిమా...ఖ‌చ్చితంగా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది అనిపిస్తుంది. మ‌రి..అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు అ ఆ ఎంత‌టి విజ‌యాన్ని సాధిస్తుంది అనేది తెలియాలంటే ఈ నెల 27 వ‌ర‌కు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.