TTD:శ్రీవారి భక్తులకు అలర్ట్ : తిరుమలలో ఆర్జిత సేవలు, దర్శన టికెట్లకు షెడ్యూల్ విడుదల.. ఇకపై ప్రతినెలా ఆ తేదీల్లోనే

  • IndiaGlitz, [Thursday,May 18 2023]

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ వేంకటేశ్వరుడి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల బుకింగ్ కోసం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి నెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, అర్చన, అష్టదళ పాదపద్మారాధన తదితర ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం భక్తులు ముందుగా నమోదు చేసుకోవాల్సి వుంటుందని టీటీడీ వెల్లడించింది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు.. ప్రతి నెలా 20వ తేదీ నుంచి 22 లోపు నిర్ధేశిత రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి వుంటుందని పేర్కొంది.

ఈ నెల 24న రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల :

ఇకపోతే.. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవా టికెట్లను ఈ నె 21వ తేదీన విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు మే 23న విడుదల చేస్తామని పేర్కొంది. అదే విధంగా రూ.300/- దర్శన టికెట్ల కోటాను 24న విడుదల చేస్తామని తెలిపింది. తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేస్తామని టీటీడీ స్పష్టం చేసింది.

ఈ డేట్స్ చూసుకుని టికెట్లు బుక్ చేసుకోవాలి :

అయితే ఒకవేళ ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టికెట్ల జారీ తేదీ ఆదివారం వస్తే వాటిని మరుసటి రోజు విడుదల చేస్తామని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు.. ఇకపై ప్రతి నెలా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను షెడ్యూల్‌లో ప్రకటించిన తేదీల్లోనే బుక్ చేసుకోవాలని భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు:

మరోవైపు.. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. టోకెన్లు లేని భక్తుల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని, నిన్న స్వామి వారిని 77,436 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ స్పష్టం చేసింది. అలాగే శ్రీవారి హుండీకి రూ.3.77 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది.

More News

Aishwarya Rajesh:వల్లి పాత్రపై వ్యాఖ్యలు .. రష్మిక అద్భుత నటి, నా మాటలకు పెడర్ధాలు తీయొద్దు  : ఇచ్చిపడేసిన ఐశ్వర్యా రాజేశ్

హీరోయిన్ అంటే అందాల ఆరబోతకే పరిమితం అనే మాటను చెరిపేసిన నటీమణుల్లో ఐశ్వర్యా రాజేశ్ ఒకరు.

Colors Swathi:అన్నీ ఆ పాత్రలే వచ్చేవి.. ఆ సినిమా టైంలో నాపై రూమర్స్ : కలర్స్ స్వాతి హాట్ కామెంట్స్

టాలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు చాలా తక్కువనే చెప్పాలి. ఎప్పుడు చూసినా నార్త్, కర్ణాటక, కేరళ అమ్మాయిలే తెలుగు తెరపై హీరోయిన్లు.

OG:క్రేజీ అప్‌డేట్ : పవన్ - సుజిత్ 'ఓజీ' రిలీజ్ టైం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలు లోడింగే

ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు హరిహర వీరమల్లు, ఓజీ, సాయితేజ్‌తో చేస్తున్న మల్టీస్టార్ సినిమాలు వున్నాయి.

JD Chakravarthy:నివృతి వైబ్స్ నుంచి ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ పాటను రిలీజ్ చేసిన జేడీ చక్రవర్తి

ప్రస్తుతం నివృతి వైబ్స్ నుంచి వస్తోన్న పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. జానపద పాటలకు నివృతి వైబ్స్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.

Naa Friendhemo Pelli:జ‌యతి ప్ర‌ధాన పాత్ర‌లో ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ మ్యూజిక్ వీడియో సాంగ్ రిలీజ్

భీమ్స్ సిసిరోలియో సంగీత సార‌థ్యంలో కాస‌ర్ల శ్యామ్‌, శ్రావ‌ణ భార్గ‌వి  కాంబోలో ఆక‌ట్టుకుంటోన్న తెలంగాణ జాన‌ప‌ద గీతం