Malavika Mohanan:హీరోయిన్లూ సూపర్‌స్టార్లే.. 'లేడీ సూపర్‌స్టార్లు' వుండరు: నయనతార‌పై మాళవిక సంచలన వ్యాఖ్యలు, ట్రోలింగ్

  • IndiaGlitz, [Monday,February 13 2023]

నయనతార.. దక్షిణాదిలో లేడి సూపర్‌స్టార్‌గా, హీరోలకు మించిన స్టార్‌డమ్‌తో దూసుకెళ్తున్న నటీమణి. ఈమె కాల్షీట్లు ఇస్తే అదే భాగ్యమని భావించే దర్శక నిర్మాతలు కోకొల్లలు. పెళ్లయినప్పటికీ నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతూనే వున్నాయి.. కొన్ని క్యారెక్టర్ల ఆమె కోసమే పుడుతున్నాయి. నయనతార వైభోగం చూసి ఆమె సమకాలీన హీరోయిన్లు, కుర్ర హీరోయిన్లు కుళ్లుకుంటూ వుంటారు. ఇదిలావుండగా ప్రస్తుతం నయనతార- మాళవికా మోహన్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. దీంతో మాళవికపై నయన్ అభిమానులు భగ్గుమంటున్నారు.

హీరోయిన్లూ సూపర్‌స్టార్లే :

అసలేం జరిగిందంటే.. మాళవిక తాజా చిత్రం ‘‘క్రిస్టి’’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో తనకు ‘‘లేడీ సూపర్‌స్టార్’’ అని పదం నచ్చదని, హీరోయిన్లను కూడా హీరోలకు మాదిరే సూపర్‌స్టార్‌గా అభివర్ణించాలని మాళవిక అన్నారు. ఈ వ్యాఖ్యలు నయన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.. తమ అభిమాన నటిని ఉద్దేశించే మాళవిక ఈ వ్యాఖ్యలు చేశారంటూ.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. వివాదం పెద్దదిగా మారుతున్న నేపథ్యంలో మాళవిక స్పందించారు. తాను ఏ ఒక్క హీరోయిన్‌ను ఉద్దేశించి మాట్లాడలేదని.. తనకు నయనతార అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఆమె నుంచి ఓ నటిగా ఎంతో స్పూర్తి పొందుతానని మాళవిక చెప్పారు.

గతంలో నయన్ నటించిన సీన్‌పై విమర్శలు:

అయితే ఇప్పుడే కాదు.. గతంలోనూ నయనతారను ఉద్దేశించి మాళివక వ్యాఖ్యలు చేశారు. నయనతార నటించి, నిర్మించిన ‘‘కనెక్ట్’’ గతేడాది డిసెంబర్ 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆసుపత్రిలో బెడ్‌పై పడుకున్న సన్నివేశంలో ఫుల్ మేకప్‌తో వుందని, అది తనను షాక్‌కు గురిచేసిందని కామెంట్ చేసింది. దీనికి అదే స్థాయిలో కౌంటరిచ్చారు నయన్. డైరెక్టర్ చెప్పిందే నేను చేశానని.. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లు గ్లామర్‌గా వుంటారని, రియలస్టిక్ చిత్రాలకు వచ్చేసరికి సన్నివేశానికి అనుగుణంగా మారాల్సి వుంటుందని.. దీనిని కొందరు తెలుసుకోవాలంటూ సుతిమెత్తగా కౌంటరిచ్చారు లేడీ సూపర్‌స్టార్.

More News

Hero Madhavan:హీరో మాధవన్‌కు పుత్రోత్సాహం.. స్విమ్మింగ్‌లో సత్తా చాటిన కొడుకు, వేదాంత్‌కు పతకాల పంట

హీరో కొడుకు .. హీరో అవుతాడనేది పాత సామెత. కానీ ఈ తరం మాత్రం అందుకు భిన్నంగా వుంటోంది.

Pawan Kalyan:కర్మ సిద్ధాంతం ఒకటుంది.. గుర్తుంచుకోండి : ఏపీ బ్యూరోక్రాట్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా జస్టిస్  అబ్ధుల్ నజీర్‌ నియామకం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందించారు.

Taraka Ratna : తారకరత్న కోసం ఫారిన్ నుంచి డాక్టర్లు.. నారాయణ హృదయాలయలోనే చికిత్స

గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే వున్నప్పటికీ.. ఆయన ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదని మీడియాలో

Rashmika Mandanna:రష్మికకు కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ అపార్ట్‌మెంట్స్ అంటూ ప్రచారం.. శ్రీవల్లి కామెంట్ ఇదే

రష్మిక మందన్నా.. ఇప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా చలామణి అవుతున్న నటి.

Samantha: సమంత ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే.. ఆ థెరపీ చేయించుకుంటున్న సామ్

హీరోయిన్‌గా తొలి నుంచి వున్న ఫేమ్‌కి తోడు, నాగచైతన్యకి విడాకులు, ఇటీవల అనారోగ్యం బారినపడటంతో సమంత ఏం చేసినా..