close
Choose your channels

Malavika Mohanan:హీరోయిన్లూ సూపర్‌స్టార్లే.. 'లేడీ సూపర్‌స్టార్లు' వుండరు: నయనతార‌పై మాళవిక సంచలన వ్యాఖ్యలు, ట్రోలింగ్

Monday, February 13, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నయనతార.. దక్షిణాదిలో లేడి సూపర్‌స్టార్‌గా, హీరోలకు మించిన స్టార్‌డమ్‌తో దూసుకెళ్తున్న నటీమణి. ఈమె కాల్షీట్లు ఇస్తే అదే భాగ్యమని భావించే దర్శక నిర్మాతలు కోకొల్లలు. పెళ్లయినప్పటికీ నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతూనే వున్నాయి.. కొన్ని క్యారెక్టర్ల ఆమె కోసమే పుడుతున్నాయి. నయనతార వైభోగం చూసి ఆమె సమకాలీన హీరోయిన్లు, కుర్ర హీరోయిన్లు కుళ్లుకుంటూ వుంటారు. ఇదిలావుండగా ప్రస్తుతం నయనతార- మాళవికా మోహన్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. దీంతో మాళవికపై నయన్ అభిమానులు భగ్గుమంటున్నారు.

హీరోయిన్లూ సూపర్‌స్టార్లే :

అసలేం జరిగిందంటే.. మాళవిక తాజా చిత్రం ‘‘క్రిస్టి’’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో తనకు ‘‘లేడీ సూపర్‌స్టార్’’ అని పదం నచ్చదని, హీరోయిన్లను కూడా హీరోలకు మాదిరే సూపర్‌స్టార్‌గా అభివర్ణించాలని మాళవిక అన్నారు. ఈ వ్యాఖ్యలు నయన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.. తమ అభిమాన నటిని ఉద్దేశించే మాళవిక ఈ వ్యాఖ్యలు చేశారంటూ.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. వివాదం పెద్దదిగా మారుతున్న నేపథ్యంలో మాళవిక స్పందించారు. తాను ఏ ఒక్క హీరోయిన్‌ను ఉద్దేశించి మాట్లాడలేదని.. తనకు నయనతార అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఆమె నుంచి ఓ నటిగా ఎంతో స్పూర్తి పొందుతానని మాళవిక చెప్పారు.

గతంలో నయన్ నటించిన సీన్‌పై విమర్శలు:

అయితే ఇప్పుడే కాదు.. గతంలోనూ నయనతారను ఉద్దేశించి మాళివక వ్యాఖ్యలు చేశారు. నయనతార నటించి, నిర్మించిన ‘‘కనెక్ట్’’ గతేడాది డిసెంబర్ 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆసుపత్రిలో బెడ్‌పై పడుకున్న సన్నివేశంలో ఫుల్ మేకప్‌తో వుందని, అది తనను షాక్‌కు గురిచేసిందని కామెంట్ చేసింది. దీనికి అదే స్థాయిలో కౌంటరిచ్చారు నయన్. డైరెక్టర్ చెప్పిందే నేను చేశానని.. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లు గ్లామర్‌గా వుంటారని, రియలస్టిక్ చిత్రాలకు వచ్చేసరికి సన్నివేశానికి అనుగుణంగా మారాల్సి వుంటుందని.. దీనిని కొందరు తెలుసుకోవాలంటూ సుతిమెత్తగా కౌంటరిచ్చారు లేడీ సూపర్‌స్టార్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.