బండ్ల గణేష్ వర్సెస్ హరీష్.. ముదురుతున్న వివాదం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా వచ్చిన ‘గబ్బర్ సింగ్‌’ సినిమా ఇటీవలే ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న విషయం విదితమే. ఈ సందర్భంగా సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్.. సినిమా యూనిట్ మెంబర్స్ అందర్నీ పేరు పేరునా ప్రస్తావించి వరుస ట్వీట్స్.. ఓ ప్రకటన సైతం విడుదల చేశాడు. అయితే ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పేరు మాత్రం అస్సలు ప్రస్తావించనే లేదు. దీంతో వివాదం మొదలైంది. అయితే ఆ తర్వాత ‘బ్లాక్‌బస్టర్ నిర్మాత’ బండ్ల అంటూ తర్వాతి ట్వీట్‌లో చెప్పాడు. అయితే.. హరీష్‌పై బండ్ల గణేష్ తనదైన తరహాలో కామెంట్ల వర్షం కురిపించారు. అప్పట్నుంచి మొదలైన ఈ వివాదానికి ఇప్పటి వరకూ ఫుల్ స్టాప్ పడలేదు. నాటి నుంచి వీరిద్దరి మధ్య పరోక్షంగా ట్వీట్ వార్ నడుస్తోంది.

ఎవరిని ఉద్దేశించో..!

‘‘తింటున్నంత సేపు ‘ఇస్తరాకు’ అంటారు.. తిన్నాక ‘ఎంగిలి’ ఆకు అంటారు. అంటే నీతో అవసరం ఉన్నంతసేపు.. వరుసలు కలిపి మాట్లాడతారు.. అవసరం తీరాక లేని మాటలు అంటకడుతారు..’’ అంటూ నిర్మాత బండ్ల గణేష్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వివాదాలకు తెరతీస్తోంది. ఈ ట్వీట్ ఎవర్ని ఉద్దేశించి చేశారబ్బా..? బండ్ల గణేష్ వారిని ఉద్దేశించే అన్నాడని సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. అంతేకాదు.. ఇంకెవర్ని మొన్న బండ్ల పేరు మరిచిపోయిన హరీష్‌నే అంటూ పలువురు ఆయన పేరును ప్రస్తావిస్తున్నారు.

కౌంటర్ల వర్షం..

‘మా గబ్బర్ సింగ్ ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచి అనుక్షణం నాకు అండగా ఉంటూ నాకు ఇంత ఘనవిజయాన్ని చేకూర్చడానికి ముఖ్య కారణమైన మిత్రులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఇంకొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని బండ్ల ట్వీట్ చేశారు. ఆ తర్వాత కష్టకాలంలో ఉన్న హరీష్‌కు తానే అవకాశం ఇచ్చానన్నట్లుగా కొన్ని ట్వీట్స్‌లో చెప్పుకొచ్చారు. దీనికి హరీష్ కూడా గట్టిగానే స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ల వర్షం కురిపించారు. ‘అసలు ‘గబ్బర్‌సింగ్’ సినిమాకి ముందు నిర్మాత నాగబాబుగారు. కానీ నాకు అవకాశం ఇచ్చినట్లే.. బండ్ల గణేష్‌గారికి కూడా పవన్ కల్యాణ్‌గారు అవకాశం ఇచ్చారు’ అని హరీష్ ట్వీట్ చేశారు. ఇలా గత వారంరోజులుగా వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో.. ఎవరు ఫుల్ స్టాప్ పెడతారో మరి!.

More News

సబ్ కలెక్టర్‌గా పవన్ వీరాభిమాని.. ఫ్యాన్స్‌లో జోష్!

టాలీవుడ్‌లో పవర్ స్టార్.. రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. పవన్ అనే పేరు వింటే చాలు అభిమానులకు ఒక తెలియని ఉత్సాహం కలుగుతుంది.

అమెజాన్ ప్రైమ్ లో నేరుగా రిలీజ్ అవుతున్న కీర్తి సురేశ్ 'పెంగ్విన్'

మ‌హాన‌టి సినిమాతో ఎంత‌గానో పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకొని, తెలుగు ప్రేక్షకుల‌కి అత్యంత‌గా చేరువైన న‌టి కీర్తి సురేశ్. ఇటీవ‌లే నేష‌న‌ల్ అవార్డ్ ని కూడా కైవ‌సం చేసుకున్నారు. మ‌హాన‌టి

విజ‌య్ దేవ‌ర‌కొండ వెబ్‌సిరీస్‌

ఇప్పుడు వెండితెర‌కు ధీటుగా డిజిట‌ల్ రంగానికి ప్రాధాన్య‌త పెరుగుతుంది. ఇది వ‌ర‌కు ఉన్న ప్రాధాన్య‌త క‌రోనా వైర‌స్ కార‌ణంగా మ‌రింతగా పెరిగింది. దీంతో ప‌లువురు స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ అంద‌రూ వెబ్

సరికొత్త జోన‌ర్‌లో నిత్యామీన‌న్ చిత్రం

న‌టిగా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ నిత్యామీన‌న్. ఈ మ‌ల‌యాళ కుట్టి 2010లో అలా మొద‌లైంది చిత్రంతోతెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

ఎన్‌బీకే 107... వైవిధ్య‌మైన పాత్ర‌లో బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో త‌న 106వ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాక మునుపే ఆయ‌న త‌న 107వ సినిమాకు