భారత్‌లో పెరుగుతున్న యూకే స్ట్రెయిన్ కేసులు..

  • IndiaGlitz, [Wednesday,December 30 2020]

భారత్‌లో యూకే కరోనా వైరస్ స్ట్రెయిన్ కల్లోలం రేపుతోంది. ఆరు కేసులతో మొదలైన కరోనా కొ్త్త స్ట్రెయిన్.. ఒక్క రోజులోనే 20కి చేరుకుంది. మంగళవారం 6 స్ట్రెయిన్ కేసులు నమోదు కాగా, కొత్తగా మరో 14 మందికి స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. దీంతో.. భారత్‌కు యూకే నుంచి వచ్చిన వారిలో మొత్తం ఇప్పటివరకూ 20 మందికి కొత్త స్ట్రైయిన్‌ నిర్ధారణ అయింది. కాగా.. దేశవ్యాప్తంగా జీనోమ్‌ సీక్వేన్సింగ్‌ ప్రయోగశాల దాదాపు 20 కేసులను గుర్తించింది. దేశ రాజధాని ఢిల్లీలో స్ట్రెయిన్ కేసులు పెరిగిపోతున్నాయి.

ఢిల్లీ ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్‌లో మొత్తం 8 మందికి కరోనా స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. తర్వాత బెంగళూరు ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్‌ను పరీక్షించగా మరో ఏడుగురికి స్ట్రెయిన్ సోకినట్లు వైద్య శాఖ అధికారులు గుర్తించారు. దేశంలోని ఇతర నగరాల్లో మరో 5 కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. స్ట్రెయిన్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకూ యూకే నుంచి 33,000 ప్రయాణికులు భారత్‌కు వచ్చినట్లు కేంద్రం గుర్తించింది.

డిసెంబర్ 9 నుంచి 22 వరకూ వచ్చిన ప్రయాణికుల్లో లక్షణాలున్న ప్రయాణికులకు, పాజిటివ్ వచ్చిన ప్రయాణికులకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. కాగా.. మరోవైపు కర్నాటకలో కొత్త వైరస్‌ బాధితుల సంఖ్య మూడుకు పెరిగింది. బెంగళూరులోని ఉత్తరహళ్లిలో ఇద్దరికి కొత్త వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. జేపీనగర్‌లో ఒకరికి కొత్త వైరస్‌ సోకినట్లు గుర్తించారు. యూకే నుంచి కర్నాటకకు వచ్చిన 2500 మందిలో 26 మందికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. వీరిలో ముగ్గురికి యూకే వైరస్‌ సోకినట్టు ఆరోగ్యశాఖ గుర్తించింది.

More News

అమెరికాలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి హత్య..

అమెరికాలో ప్రముఖ ఎన్ఆర్ఐ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ అధికార ప్రతినిధిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లు టెర్రరిస్ట్‌లతో సమానం: సీపీ సజ్జనార్

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారి విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘వ‌కీల్ సాబ్’‌... ప‌వ‌న్ పూర్తి చేశాడు

వ‌కీల్‌సాబ్‌..ఇటు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు, అటు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఓపెద్ద టెన్ష‌న్ తీరింది. ‘వ‌కీల్ సాబ్’ సినిమా కోసం ప‌వ‌న్ చాలా త‌క్కువ రోజులే కాల్షీట్స్ ఇచ్చాడు.

ఎల్ఆర్ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్‌పై (వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు) ప్రజానీకం నుంచి వ్యతిరేకత వస్తోంది.

న్యూ ఇయర్ ముందు ఉద్యోగులపై కేసీఆర్ వరాల జల్లు

నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో