Venkat:వెంకట్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ ప్రారంభం!!

  • IndiaGlitz, [Sunday,April 30 2023]

మైత్రి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ గా తెరకెక్కబోతున్న సినిమా ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రాజ్ తాళ్లూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నటుడు అలీ, నిర్మాత రామ్ తాళ్లూరి, దర్శకులు వైవిఎస్. చౌదరి, వేణు ఉడుగుల, శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్ర ప్రారంభోత్సవంలో సుచిరిండియా కిరణ్ క్లాప్ కొట్టగా, దర్శకులు వేణు ఉడుగుల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి వైవిఎస్ చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. క్రైం కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరో వెంకట్ ,రవిందర్ రెడ్డి, ఆదిత్య, మహేష్ విట్ట, వెంకట్, వేద్విక, చాందిని రావ్, శుభశ్రీ నటిస్తున్నారు. త్వరలో టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ప్రకటించనున్నారు.

ఈ సందర్భంగా దర్శకులు రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ... మంచి కాన్సెప్ట్ తో అందరికి నచ్చే సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఈ నెల 10నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాతలు ప్రవీణ్ రెడ్డి గారు వాసుదేవగార్ల సహకారం మారువలేనిని అన్నారు.

నిర్మాత ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ... దర్శకులు రామ్ తాళ్లూరి గారు మంచి స్క్రిప్ట్ చెప్పారు. ఈ కథ నచ్చి వెంటనే సినిమా చేద్దాం అని చెప్పాను. ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారని నమ్మకం ఉంది. అందరికి నచ్చే సినిమాతో మీ ముందుకు వస్తున్నాము అన్నారు.

నటీనటులు: హీరో వెంకట్ ,రవిందర్ రెడ్డి, శ్రీహరి, ఆదిత్య, మహేష్ విట్ట, వేద్విక, చాందిని రావ్, శుభశ్రీ

More News

Rashmika:అక్క కోసం ఒంటరిగా చెన్నైకి.. ‘‘రెయిన్‌ బో’’ సెట్స్‌లో చెల్లితో రష్మిక సందడి, ఆ హగ్స్ ది బెస్ట్ అన్న నేషనల్ క్రష్

రష్మిక మందన్నా.. ఇప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా చలామణి అవుతున్న నటి.

Rajinikanth:ఎన్టీఆర్‌లా మేకప్ వేసుకున్నా.. నా ఫ్రెండ్ కోతిలా వున్నానని అన్నాడు, 2024లో చంద్రబాబు గెలిస్తే : రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్‌ను స్పూర్తిగా తీసుకునే తాను సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు సూపర్‌స్టార్ రజనీకాంత్. శుక్రవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో

Samantha:సమంత స్టంట్స్ చూశారా.. సూపర్‌ ఉమెన్‌ లుక్‌లో సామ్, ఆ దెబ్బకు ప్రత్యర్థులు చిత్తే

సమంత.. ఈ పేరు తెలియని వారుండరు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు సామ్.

Heavy Rain HYD:హైదరాబాద్‌లో దంచికొట్టిన భారీ వర్షం : కొట్టుకుపోయిన బైకులు, కార్లు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్‌ను భారీ వర్షం వణికించింది. శనివారం పొద్దుపొద్దున్నే నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Shirdi:సాయి భక్తులకు అలర్ట్ .. షిర్డీలో మే 1 నుంచి నిరవధిక బంద్, ఎందుకంటే..?

షిర్డీ సాయి భక్తులకు షాకింగ్ న్యూస్. షిర్డీ గ్రామస్తులు మే 1 నుంచి నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించారు.