26 ఏళ్ల 'చంటి'

  • IndiaGlitz, [Wednesday,January 10 2018]

చిన్న‌ప్ప‌ట్నుంచి పాటలు, తల్లి, తల్లి ప్రేమ తప్ప మ‌రేమీ తెలియని ఒక అమాయకుడికి.. ఓ అమ్మాయి ప్రేమ అనుభ‌వంలోకి వ‌చ్చాక అత‌ని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనే పాయింట్‌తో తెర‌కెక్కిన చిత్రం చంటి'. టైటిల్ రోల్‌లో విక్టరీ వెంకటేష్ జీవించార‌నే చెప్పాలి. మీనా క‌థానాయిక‌గా నటించిన ఈ చిత్రం మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌గా అప్పట్లో సంచలన విజయం సాధించింది. సుజాత, నాజర్, వినోద్, ప్రసన్న కుమార్, మంజుల, సుధారాణి, బ్రహ్మానందం తదితరులు ఇత‌ర ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వ‌హించారు. 40 డైరెక్ట్ సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.

ఇళయరాజా స్వరపరచిన ప్రతీపాట శ్రోతలను అలరించింది. బాలు, చిత్ర గళాన.. వేటూరి, సాహితీ కలాలనుంచి జాలువారిన ఈ పాటలు ఇప్ప‌టికీ తెలుగునాట వినిపిస్తూనే ఉంటాయి. “పావురానికి పంజరానికి” పాటకిగానూ బాలు ఉత్తమ గాయకుడిగా అవార్డుని కూడా పొందారు. తమిళంలో చిన్నతంబి'గా రూపొందిన సినిమాకి రీమేక్‌గా కె.ఎస్.రామారావు ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో చంటి పాత్రకి ముందుగా రాజేంద్ర ప్రసాద్ ని అనుకున్నారట. కాని తమిళ్‌లో హిట్ అయిన తర్వాత ఈ సినిమాకి వెంకటేష్ అయితే బాగుంటుందని నిర్మాత ఫిక్స్ అయ్యారట. హిందీలోనూ వెంక‌టేష్ క‌థానాయకుడిగా అనారి' పేరుతో రీమేక్ అయిన ఈ సినిమా.. అక్క‌డా మంచి విజ‌యం సాధించింది. జనవరి 10, 1992న‌ విడుదలైన చంటి'.. నేటితో 26 ఏళ్ళు పూర్తిచేసుకుంది.

More News

'లక్కీఫెలో' సినిమా 'లవ్‌లీ' కంటే పెద్ద హిట్‌ అవుతుంది - డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి.

జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి రచయిత్రిగా, 'సూపర్‌హిట్‌' పత్రిక జనరల్‌ మేనేజర్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న జయ బి, సినిమాల మీద మక్కువతో 'చంటిగాడు' చిత్రంతో దర్శకురాలిగా మారి 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' 'వైశాఖం' లాంటి ఫీల్‌గుడ్‌ మూవీస్‌ని ప్రేక్షకులకందించి దర్శకురాలిగా తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని తెచ్చుకున్నా

'టిక్ టిక్ టిక్‌' టీజ‌ర్ విడుద‌ల‌

జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి చ‌ద‌ల‌వాడ నిర్మాతగా వ‌స్తోన్న   చిత్రం 'టిక్ టిక్ టిక్‌'.

మహానటిలా నేను చేయలేనని అన్నా - కీర్తి

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

నిఖిల్ కి జోడీగా కేథరిన్

విభిన్న పాత్రలను చేయడానికి ముందుండే కథానాయకులలో

కన్ ఫర్మ్ చేసిన బోయపాటి

నటసింహ బాలకృష్ణ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో