రీమేక్‌ పై ఆస‌క్తి..

  • IndiaGlitz, [Wednesday,November 22 2017]

టాలీవుడ్‌లో ఎక్కువ రీమేక్ చిత్రాల్లో న‌టించిన హీరోగా సీనియ‌ర్ హీరో వెంక‌టేష్‌కు పేరుంది. రీమేక్ చిత్రాలు చేయ‌డం సేఫ్ జోన‌ర్‌లో ఉండ‌ట‌మే ఓ ర‌కంగా కార‌ణం కావ‌చ్చు. ఏజ్‌కు త‌గ్గ‌ట్టు క‌థ‌లు దొర‌క్క కూడా పోయుండొచ్చు. ఏదేమైనా దృశ్యం, గోపాల గోపాల రీసెంట్‌గా గురు సినిమాలు త‌ర్వాత వెంక‌టేష్ రీమేక్ సినిమాలోనే న‌టిస్తాడ‌ని వార్త‌లు కూడా వినిపించాయి.

అయితే త్వరలోనే తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయుబోతున్నారు. ఈ సినిమాతో పాటు వెంకటేష్ ఓ రీమేక్ సినిమాలో చేయుడానికి ఆసక్తిని కనపరుస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి. వివ‌రాల్లోకెల్తే.. మలయాళ హీరో మమ్ముట్టి నటించిన చిత్రం 'ది గ్రేట్ ఫాదర్' అనే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టుకుంది.

30 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన ఈ చిత్రాన్ని ఇటీవ‌ల వెంకటేష్ చూశాడట. అందులో ఎమోషన్స్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉండటంతో ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బావుంటుందనే ఆలోచనలో ఉన్నాడట వెంకటేష్. దృశ్యం, గోపాల గోపాల, గురు సహా పలు రీమేక్ చిత్రాల్లో నటించిన వెంకటేష్.. అన్ని అనుకున్నట్లు కుదిరితే మరో రీవేుక్‌లో నటిస్తారని సమాచారం.

More News

వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్ర - నివేదా పేతురాజ్‌

నేను పుట్టింది తమిళనాడులో..పెరిగింది దుబాయ్‌లో. అమ్మ తమిళియన్ నాన్న తెలుగువారు. ఇప్పటి వరకు తమిళ్‌లో నాలుగు చిత్రాల్లో నటించాను. రెండు విడుదలయ్యాయి. మరో రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 'మెంటల్ మదిలో' నా తొలి తెలుగు చిత్రం అని అంటుంది హీరోఇయ‌న్ నివేదా పేతురాజ్‌.

కాలేజీ డేస్ గుర్తుకొచ్చాయంటున్న హీరోయిన్‌..

ర‌ష్మిక మండ‌న్నా..కిరిక్ పార్టీతో స‌క్సెస్ కొట్టి, ఆ ద‌ర్శ‌కుడితోనే ప్రేమ‌లో మునిగిన ఈ అమ్మ‌డు తెలుగులో నాగశౌర్య హీరోగా రూపొందుతోన్న 'ఛలో' చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.

సీక్వెల్ హీరోయిన్‌గా అనన్య‌..

అనన్య అంటే జ‌ర్నీ చిత్రంలో న‌టించిన హీరోయిన్ కాదు..బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న అన‌న్య పాండే. విల‌క్ష‌ణ న‌టుడు చంకీ పాండే కుమార్తె ఈమె.

ఈ 24న ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్ లో శివ సాయి సమర్పణలో నిర్మాత ప్రశ్నాద్  తాతా నిర్మిస్తున్న చిత్రం ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు.

'ఖాకి' ఇంట్రస్టింగ్ లొకేషన్స్

సినిమా చూస్తున్నంత సేపు మనకు లొకేషన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సినిమాల్లో చూసిన లొకేషన్లనే చూపించడం ఒక పద్ధతి. కానీ అప్పటిదాకా ప్రేక్షకుడికి అనుభవంలో లేని లొకేషన్లను కళ్లకు కట్టడం మరో పద్ధతి.