ముస్తాబవుతున్న 'వెన్నెల్లో హాయ్ హాయ్'

  • IndiaGlitz, [Saturday,September 19 2015]

సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి వెన్నెల్లో హాయ్ హాయ్' అనే పేరును ఖరారు చేశారు. అజ్మల్, నిఖిత నారాయణ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేష్ నిర్మించారు.

అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ నాకు వంశీగారంటే ఎంతో అభిమానం. చక్కటి కుటుంబ విలువలతో మేళవింపుతో తెరకెక్కించిన అందమైన ప్రేమకథా చిత్రమిది. వంశీ మార్క్ కామెడీతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.తెలుగు చిత్రసీమ గర్వించే దిగ్ధర్శకుడైన వంశీతో కలిసిన పనిచేయడం ఆనందంగా వుంది.తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ చిత్రాల్ని తీసే వంశీ దర్శకత్వంలో సినిమా నిర్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను' అని తెలిపారు.

ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, మాటలు: చందు, కెమెరా: యం.వి.రఘు, ఆర్ట్: రవీంద్రనాథ్ ఠాగూర్, కొరియోగ్రఫీ: స్వర్ణ, పాటలు: ప్రవీణ్ లక్మ, సంగీతం: చక్రి, సమర్పణ: నిఖితశ్రీ, నిర్మాత: డి. వెంకటేష్, దర్శకుడు: వంశీ.

More News

నారా రోహిత్ సినిమాలో నంద‌మూరి హీరో..

నారా రోహిత్ వినాయ‌క చ‌వితి రోజు రెండు సినిమాలు ప్రారంభించాడు. అందులో ఒక‌టి అస‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో జ్యోఅచ్చుతానంద చిత్రం మ‌రొక‌టి నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ తెర‌కెక్కించే చిత్రం.

ప‌వ‌న్, మ‌హేష్ కోసం క‌థ‌ రెడీ అంటున్న యంగ్ డైరెక్ట‌ర్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్‌..వీరిద్ద‌రి కోసం క‌థ‌లు రెడీ చేసానంటున్నాడు ఓ యంగ్ డైరెక్ట‌ర్. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు మారుతి.

సెప్టెంబ‌ర్ 25న విడుద‌ల‌వుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'ది ఐస్'

రామ్ గోపాల్ వర్మ ‘365 డేస్’ చిత్రాన్ని నిర్మించిన యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ డి.వి.వెంకటేష్ నిర్మాతగా డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై మీరాజాస్మిన్ ప్రధానపాత్రలో నటించిన మలయాళ చిత్రాన్ని‘ది ఐస్’

బ్రూస్ లీ లో చిరు పాత్ర ఇదేనా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్నభారీ చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు.

బ్యాంకాక్ నేప‌థ్యంలో 'ప్లేయ‌ర్‌'

ట్రిపులెక్స్ సోప్ యాడ్ ద్వారా న‌టుడిగా ప‌రిచ‌య‌మైన ప‌ర్వీణ్ రాజ్ ఇప్పుడు హీరోగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానున్నారు.