close
Choose your channels

బ్యాంకాక్ నేప‌థ్యంలో 'ప్లేయ‌ర్‌'

Saturday, September 19, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ట్రిపులెక్స్ సోప్ యాడ్ ద్వారా న‌టుడిగా ప‌రిచ‌య‌మైన ప‌ర్వీణ్ రాజ్ ఇప్పుడు హీరోగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానున్నారు. డ్రీమ్ మ‌ర్చంట్స్ నిర్మాణ సార‌థ్యంలో య‌మున కిషోర్‌, జ‌గ‌దీష్ కుమార్ కాళ్ళూరి నిర్మాత‌లు. జ్ఞాన సాగ‌ర్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న మాట్లాడుతూ ``బ్యాంకాక్ నేప‌థ్యంలో కొత్త‌గా రూపొందిన థ్రిల్ల‌ర్ ఇది. ఈ సినిమాలోఓ నాగినీడు ప్రొఫెస‌ర్ గా క‌నిపిస్తారు. ఆయ‌న పాత్ర ఈ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఎన్నో సినిమాలు అనుభ‌వం ఉన్న న‌టుడిలా ఈ సినిమా ప‌ర్వీణ్ రాజ్ చేయ‌డం యూనిట్ అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. మంచి క‌థ‌తో వ‌స్తే తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మకంతో ఈ సినిమాను చేశాం`` అని అన్నారు.

చిత్ర నిర్మాత‌లు య‌మున కిషోర్‌, జ‌గ‌దీష్ కుమార్ కాళ్ళూరి మాట్లాడుతూ ``క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా ప‌ర్వీణ్ రాజ్‌ని ఎంచుకుని ఈ సినిమా చేయ‌డం జ‌రిగింది. కొత్త ద‌ర్శ‌కుడైనా జ్ఞాన‌సాగ‌ర్ ప్ర‌తీ స‌న్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తీశారు. బ్యాంకాక్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన క‌థ కావ‌డంతో 95 శాతం షూటింగ్ బ్యాంకాక్‌లోనే షూటింగ్ చేయ‌డం జ‌రిగింది. ఈ సినిమాలో హీరోకి త‌ల్లిగా సీత న‌టించ‌డం జ‌రిగింది. అక్టోబ‌ర్‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నాం`` అన్నారు.

ప‌ర్వీణ్ రాజ్‌, నాగినీడు, సీత‌, షాహి హాందీ, చాణిక్య సాయి, తిరు, అప్పాజీ అంబ‌రీష్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. ఈ సినిమాకు ఎడిటింగ్‌: విన‌య్ రామ‌స్వామి, కెమెరా: సురేష్‌.ఎస్‌., సంగీతం: ర‌జీష్ ర‌ఘునాథ్‌, నిర్మాత‌లు: య‌మున కిశోర్‌, జ‌గ‌దీష్ కుమార్ కాళ్ళూరి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జ‌్ఞాన‌సాగ‌ర్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.