close
Choose your channels

ఐశ్వ‌ర్యా రాజేష్‌కి చాలా స్పెష‌ల్‌

Tuesday, August 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐశ్వ‌ర్యా రాజేష్‌కి చాలా స్పెష‌ల్‌

ఐశ్వ‌ర్యా రాజేష్ కి ఈ నెల 23వ తేదీ చాలా చాలా స్పెష‌ల్‌. తెలుగులో ఆమె న‌టించిన తొలి స్ట్రెయిట్ చిత్రం `కౌస‌ల్యా కృష్ణ‌మూర్తి` విడుద‌ల కానుంది. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో, వ‌ల్ల‌భ నిర్మించిన చిత్ర‌మిది. భీమ‌నేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను త‌మిళంలో శివ కార్తికేయ‌న్ `క‌నా` పేరుతో నిర్మించారు. `క‌నా` చిత్రానికి అఫిషియ‌ల్ రీమేక్‌గా `కౌస‌ల్యా కృష్ణ‌మూర్తి`రూపొందించారు. ఈ చిత్రంలో ఆమె క్రికెట‌ర్‌గా న‌టించారు. త‌మిళంలో ఆల్రెడీ హిట్ అయిన సినిమా ఇది.

తెలుగులోనూ పాజిటివ్ బ‌జ్ ఉంది. ఇప్ప‌టికే పాట‌ల‌న్నీ హిట్ అయ్యాయి. మ‌రోవైపు ఐశ్వ‌ర్య రాజేష్‌కి ఈ నెల 23 త‌మిళ‌నాడులో కూడా చాలా స్పెష‌ల్‌. ఈ ఏడాది ఆమె న‌టించిన త‌మిళ సినిమా ఇప్ప‌టిదాకా విడుద‌ల కాలేదు. ఈ నెల 23న తొలిసారి విడుద‌ల కానుంది. ఆ సినిమా పేరు `మెయ్‌`. అంటే నిజం అని అర్థం. ఆ చిత్రం మెడిక‌ల్ థ్రిల్ల‌ర్ అన్న‌మాట‌. ఒక హీరోయిన్‌కి ఒకే రోజు రెండు సినిమాలు, రెండు భాష‌ల్లో విడుద‌ల కావ‌డం చాలా స్పెష‌ల్ అని చెప్పుకొచ్చింది ఐశ్వ‌ర్య‌. అన్న‌ట్టు ఐశ్వ‌ర్య పుట్టిపెరిగిందంతా త‌మిళ‌నాడులోనే అయినా, ప‌ద‌హార‌ణాల తెలుగ‌మ్మాయే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.