'బిచ్చగాడు 2' షురూ.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న మురుగదాస్!

  • IndiaGlitz, [Friday,July 23 2021]

ఐదేళ్ల క్రితం విడుదలైన బిచ్చగాడు చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. విజయ్ ఆంటోని నటించిన ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. విజయ్ ఆంటోని నటన, కథ, టేకింగ్ ఇలా ప్రతి ఒక్క అసం బిచ్చగాడు చిత్రంలో హైలైట్ గా నిలిచింది.

ఐదేళ్ల తర్వాత బిచ్చగాడు చిత్ర సీక్వెల్ కు రంగం సిద్ధం అయింది. బిచ్చగాడు 2 అంటూ విజయ్ ఆంటోని కొద్దిసేపటి క్రితమే సర్ ప్రైజ్ ఇచ్చాడు. బిచ్చగాడు చిత్రం శశి దర్శకత్వంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. బిచ్చగాడు 2 దర్శకుడు ఎవరు అనే సస్పెన్స్ కు జూలై 24న తెరపడనుంది.

స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్ర దర్శకుడిని జూలై 24న ఉదయం 11 గంటలకు రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ లోనే ఈ చిత్రం నిర్మించబడనుంది. బిచ్చగాడు చిత్రానికి విజయ్ ఆంటోనినే సంగీతం అందించాడు.

బిచ్చగాడు 2 చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరో త్వరలోనే తెలియనుంది. ధనవంతుడైన వ్యాపారవేత్త తన తల్లి ఆరోగ్యం కోసం కొన్ని రోజులపాటు అజ్ఞాతంగా ఉంటూ బిచ్చగాడిగా జీవిస్తాడు. ఓ సాధువు చెప్పినట్లు బిచ్చగాడిగా తన తల్లి కోసం ఆ పని చేస్తాడు. ఈ పాయింట్ తోనే బిచ్చగాడు చిత్రం తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకుంది.

More News

దిల్ రాజు కుమార్తె హన్షిత ఎంట్రీ.. స్టార్ కిడ్స్ తరహాలోనే..

టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ ఎవరంటే టక్కున దిల్ రాజు పేరు గుర్తుకు వచ్చేస్తుంది.

కిక్కెక్కించే హాట్.. ప్యాంట్ అన్ జిప్ చేసి, టాప్ లెస్ గా స్టార్ హీరో చెల్లి!

బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ చెల్లి క్రిష్ణా ష్రాఫ్ బోల్డ్ ఫోజులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతోంది. అటు టైగర్ ష్రాఫ్..

మెమొరబుల్ పిక్: చిరు మూవీ సెట్ లో రోజా,మీనా.. నేరుగా నాగ్ మూవీ నుంచి..

ఒకప్పటి అందాల తార మీనా తాజాగా సోషల్ మీడియాలో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

ఉదయ్ కిరణ్ తో పోల్చవద్దు.. అతడికి జరిగింది బాధాకరం: వరుణ్ సందేశ్

హ్యాపీ డేస్, కొత్తబంగారు లోకం లాంటి చిత్రాలతో వరుణ్ సందేశ్ అప్పట్లో టాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు పొందాడు.

వారేవా.. సూపర్ హీరోగా రానా దగ్గుబాటి

ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.