close
Choose your channels

దిల్ రాజు కుమార్తె హన్షిత ఎంట్రీ.. స్టార్ కిడ్స్ తరహాలోనే..

Friday, July 23, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దిల్ రాజు కుమార్తె హన్షిత ఎంట్రీ.. స్టార్ కిడ్స్ తరహాలోనే..

టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ ఎవరంటే టక్కున దిల్ రాజు పేరు గుర్తుకు వచ్చేస్తుంది. టాలీవుడ్ లో అత్యధిక విజయలశాతం ఉన్న నిర్మాత ఆయన. కథల ఎంపిక, సినిమా ప్లానింగ్ లో దిల్ రాజు నిర్ణయాలు పక్కాగా ఉంటాయి. చిన్న సినిమా అయినా,పెద్ద ప్రాజెక్ట్ అయినా దిల్ రాజు టేకప్ చేస్తే హిట్ పడాల్సిందే. అంతలా దిల్ రాజు పాపులర్ అయ్యారు. దిల్ రాజు నిర్మాతగా 50 చిత్రాలకు చేరువలో ఉన్నారు.

దిల్ రాజు కుమార్తె హన్షిత ఎంట్రీ.. స్టార్ కిడ్స్ తరహాలోనే..

దిల్ రాజు వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆయన కుమార్తె హన్షిత రెడ్డి రెడీ అయిపోయిందని టాక్. హన్షిత నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతోందట. అంటే టాలీవుడ్ లో మరో స్టార్ కిడ్ తండ్రి అడుగుజాడల్లో నడిచేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే హన్షిత డిజిటల్, ఓటిటి కంటెంట్ ని నిర్మించబోతోంది. ఆమె నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడంపై అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.

దిల్ రాజు కుమార్తె హన్షిత ఎంట్రీ.. స్టార్ కిడ్స్ తరహాలోనే..

టాలీవుడ్ లో స్టార్ వారసులు తమ తండ్రుల అడుగుజాడల్లో నడవడం ఇదేమీ కొత్త కాదు. స్టార్స్ పిల్లలు హీరోలు, హీరోలు ఎలా అవుతున్నారో అలాగే నిర్మాతలుగా మారినవాళ్లు కూడా ఉన్నారు. హన్షితకు సినిమాలంటే బాగా ఆసక్తి అట. అందుకే తండ్రి నిర్మాతగా దూసుకుపోతున్నప్పటికీ తాను కూడా మరోవైపు డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటోంది.

దిల్ రాజు కుమార్తె హన్షిత ఎంట్రీ.. స్టార్ కిడ్స్ తరహాలోనే..

హన్షిత 2014లో అర్చిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. హన్షిత నిర్మాతగా మారబోతున్న మరో స్టార్ కిడ్ గా ఆ జాబితాలో చేరిపోయింది. చిరంజీవి కుమార్తె సుష్మిత త్వరలో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతోంది. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఇప్పటికే నిర్మాత అయ్యారు.

దిల్ రాజు కుమార్తె హన్షిత ఎంట్రీ.. స్టార్ కిడ్స్ తరహాలోనే..

అశ్వినీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేశారు. డైరెక్టర్ కోడి రామకృష్ణ కుమార్తె దివ్య ఇటీవలే నిర్మాతగా తన తొలి చిత్రం ప్రకటించారు. బహుశా ఫ్యూచర్ లో ఫిమేల్ ప్రొడ్యూసర్స్ టాలీవుడ్ ని డామినేట్ చేయనున్నారేమో!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos