ఆగ‌స్టులో రానున్న విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రాలు

  • IndiaGlitz, [Friday,June 22 2018]

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్ళి చూపులు చిత్రాలతో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అర్జున్ రెడ్డితో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయారు. ఈ సినిమా విజ‌య్‌కు యూత్‌లో ప్ర‌త్యేక గుర్తింపును తీసుకువ‌చ్చింది. ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు విజ‌య్‌. ఇటీవ‌లే మ‌హాన‌టిలో అతిథి పాత్ర‌లో క‌నిపించిన విజ‌య్‌.. ఆగ‌స్టు నెల‌లో రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్నారు. ఆ రెండు చిత్రాలే టాక్సీ వాలా, గీత గోవిందం.

రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన టాక్సీవాలా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుని.. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. మే నెల‌లోనే విడుద‌ల కావాల్సిన ఈ సినిమా.. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా ఆగ‌స్టులో విడుద‌ల కానుంద‌ని తెలుస్తోంది. అదే ఆగ‌స్టులో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన మ‌రో చిత్రం గీత గోవిందం కూడా విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టించింది. మొత్తానికి.. ఆగ‌స్టులో విజ‌య్ దేవ‌ర‌కొండ రెండు చిత్రాల‌తో డబుల్ ధ‌మాకా ఇవ్వ‌నున్నార‌న్న‌మాట‌.

More News

మ‌హేష్ సినిమాలో అదితిరావ్ హైద‌రీ?

స‌మ్మోహ‌నం చిత్రంతో ఆక‌ట్టుకున్న క‌థానాయిక అదితి రావ్ హైద‌రీ. ఇందులో స‌మీరా రాథోడ్‌గా న‌టించి.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిందీ ముద్దుగుమ్మ‌.

చిరు చిన్న‌ల్లుడు ఖాతాలో మ‌రో చిత్రం?

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు క‌ళ్యాణ్ దేవ్ క‌థానాయ‌కుడిగా తెరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజేత పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి నిర్మించ‌గా..

విజ‌య్ 'స‌ర్కార్‌'

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న కొత్త చిత్రానికి 'స‌ర్కార్' అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు.

షారూక్ లైవ్ షో...

పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో బాలీవుడ్ హీరో హీరోయిన్స్ పెర్‌ఫార్మెన్స్ చేస్తుంటారు. ఇలా పెర్‌ఫార్మ్ చేసినందుకు వీరికి భారీ మొత్తం ముడుతుంటుంది.

ఒకింటివార‌వుతున్న ప్రేమ జంట‌...

బాలీవుడ్ స్టార్స్ ప్రేమ ప‌క్షుల విహార‌యాత్ర‌లు చేస్తుంటారు. కానీ పెళ్లి చేసుకునే వారు మాత్రం త‌క్కువ మందే ఉంటారు.