close
Choose your channels

విజ‌య్ 'స‌ర్కార్‌'

Thursday, June 21, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజ‌య్ స‌ర్కార్‌

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న కొత్త చిత్రానికి `స‌ర్కార్` అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు. జూన్ 22న విజ‌య్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను.. విజ‌య్ లుక్‌ను నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ విడుద‌ల చేసింది. స‌రికొత్త విజ‌య్ లుక్‌కి అభిమానులు, ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్రలో న‌టిస్తుంది. `త‌పాకీ`, `క‌త్తి` సినిమాల త‌ర్వాత విజ‌య్ హీరోగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఇందులో కూడా రాజ‌కీయ నేప‌థ్యం ఉంటుంద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు అంటున్నాయి. దీపావ‌ళి సంద‌ర్భంగా సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాణ సంస్థ భావిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.