close
Choose your channels

తెలుగులో విడుదల కానున్న విశాల్ 'అయోగ్య'

Saturday, May 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగులో విడుదల కానున్న విశాల్ అయోగ్య

హీరో విశాల్ లేటెస్ట్ త‌మిళ చిత్రం 'అయోగ్య'. త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా 'అయోగ్య‌' అనే టైటిల్‌తోనే విడుద‌ల చేస్తున్నారు. తెలుగు నిర్మాత ఠాగూర్ మ‌ధు తొలిసారి త‌మిళంలో నిర్మించిన చిత్ర‌మిది. తొలి సినిమాతో ఠాగూర్ మ‌ధు నిర్మాత‌గా భారీ విజ‌యాన్ని అందుకున్నారు.

ఈ చిత్రం తెలుగు హ‌క్కుల‌ను మ‌ల్కాపురం శివ‌కుమార్ సొంతం  చేసుకున్నారు. ప్ర‌స్తుతం అనువాద కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూన్‌లో సినిమాను విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు.

రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. ఠాగూర్ మ‌ధు నిర్మంచిన ఈ చిత్రాన్ని వెంక‌ట్ మోహ‌న్ డైరెక్ట్ చేశారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించారు. హీరో విశాల్ న‌ట‌నే సినిమాకు హైలైట్‌గా నిల‌చిందని త‌మిళ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు చిత్రాన్ని అప్రిషియేట్ చేశారు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.