మాస్ హీరో విశాల్ హీరోగా 'టెంపర్' రీమేక్

  • IndiaGlitz, [Friday,March 18 2016]

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి కమర్షియల్‌ విజయాలతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ హీరోగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి సూపర్ డూపర్ హిట్ అయిన టెంపర్' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో నల్లమలుపుబుజ్జి, ఠాగూర్ మధు, బండ్ల గణేష్ లు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ...

చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు మాట్లాడుతూ 'తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందిరికీ తెలసిందే. ఎన్టీఆర్ అద్భుతమైన నటనకు బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళంలో విశాల్ హీరోగా రీమేక్ చేయనున్నాం. పందెంకోడి, పొగరు వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలతో తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మాస్ ఇమేజ్ తెచ్చుకున్న విశాల్ తో ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించనుండటం చాలా హ్యపీగా ఉంది. విశాల్ కు కొత్త బాడీ లాంగ్వేజ్ ను ఆపాదించే చిత్రంగా ఈ చిత్రం ఓ ట్రేడ్ మార్క్ క్రియేట్ చేస్తుందని కచ్చితంగా చెప్పగలను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరోయిన్, దర్శకుడు సహా ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం'' అన్నారు.

More News

సునీల్ న్యూమూవీ టైటిల్...

కమెడియన్ టర్నడ్ సునీల్ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆర్.పి.ఎ క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్.సుదర్శనరెడ్డి నిర్మిస్తున్నారు.

రజనీకాంత్ 'కబాలి' రిలీజ్ డేట్....

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం ‘కబాలి’.

పవర్ స్టార్ ను అవమానించిన హీరో....

తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

'నాయకి' టీజర్ విడుదల

త్రిష ప్రధాన పాత్రధారిగా రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై గోవి దర్శత్వంలో మామిడిపల్లి గిరిధర్,పద్మజ మామిడిపల్లి సంయుక్తంగి నిర్మిస్తున్న చిత్రం నాయకి.

సక్సెస్ కోసం సందీప్ టూర్..

సందీప్ కిషన్,అనీషా అంబ్రోస్ జంటగా మిస్టర్ నూకయ్య ఫేం అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రన్.