close
Choose your channels

మాస్ హీరో విశాల్ హీరోగా 'టెంపర్' రీమేక్

Friday, March 18, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి కమర్షియల్‌ విజయాలతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ హీరోగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి సూపర్ డూపర్ హిట్ అయిన టెంపర్` చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో నల్లమలుపుబుజ్జి, ఠాగూర్ మధు, బండ్ల గణేష్ లు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ...

చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు మాట్లాడుతూ `తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్` ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందిరికీ తెలసిందే. ఎన్టీఆర్ అద్భుతమైన నటనకు బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళంలో విశాల్ హీరోగా రీమేక్ చేయనున్నాం. పందెంకోడి, పొగరు వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలతో తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మాస్ ఇమేజ్ తెచ్చుకున్న విశాల్ తో ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించనుండటం చాలా హ్యపీగా ఉంది. విశాల్ కు కొత్త బాడీ లాంగ్వేజ్ ను ఆపాదించే చిత్రంగా ఈ చిత్రం ఓ ట్రేడ్ మార్క్ క్రియేట్ చేస్తుందని కచ్చితంగా చెప్పగలను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరోయిన్, దర్శకుడు సహా ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.