పెళ్లి కాని ప్రసాద్ కథతో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటోన్న 'అశోకవనంలో అర్జున కళ్యాణం' టీజర్

  • IndiaGlitz, [Wednesday,February 02 2022]

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాల విషయంలో దూకుడు పెంచారు. 'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ సేన్ ప్రస్తుతం.. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో అర్జున్ అనే వడ్డీ వ్యాపారిగా కనిపించనున్నారాయన. మార్చి 4న ఈ సినిమాను విడుదల తేదీని తెలియజేస్తూ.. ఈరోజు చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ చేసింది.

అరే... ఇంటర్ క్యాస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్.. సినిమాల్లో అయినా అయితదారా? నీకే ఫస్టా? అని డైలాగ్‌తో టీజర్ ప్రారంభమయ్యింది. 'ఇప్పటివరకూ ఎన్ని సంబంధాలు చూశారు?' అని హీరోయిన్ పక్కనున్న అమ్మాయి అడిగితే... 'లెక్క పెట్టలేదు' అని హీరో చెప్పడం... 'అయితే పెద్ద నంబరే' అని ఆ అమ్మాయి కౌంటర్ ఇవ్వడం బాగుంది. 'గోదావరి అల్లుడు గారు పెళ్లికి ముందే పిల్ల చుట్టూ... అయ్ అయ్' , 'తాగితే గానీ మా బతుకులకు ఏడుపు రాదు. తాగినోడి ఏడుపుకి ఏమో వాల్యూ లేదు' అని డైలాగులు బాగున్నాయి.

30 ఏళ్లు వచ్చినా... పెళ్లికాకపోవడంతో ఓ అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. అతనికి చివరికి పెళ్లి ఎలా కుదిరింది అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' కథకికి సంబంధించి హీరో విశ్వక్ సేన్ అల్రెడీ హింట్ ఇచ్చేశాడు. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు విశ్వక్ సేన్. 'ఇంకా రెండు రోజులే ఉంది.. పిల్లని వెతికి పెట్టండి లేదా కనీసం పడేయటానికి టిప్స్‌ అయినా ఇవ్వండి. వయసు 30 దాటింది. పొట్ట, జుట్టు.. చాలా కష్టాలున్నాయి' అంటూ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీనిని బట్టే ఇది పెళ్లి కాని ప్రసాదు కథ అని అర్థమైపోయింది. తాజాగా టీజర్‌లో పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.

ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్‌ ప్రసాద్ సమర్పణలో... ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జై క్రిష్ సంగీతం అందించిన ఈ సినిమాకు 'రాజావారు రాణీగారు' ఫేమ్ రవికిరణ్ కోలా కథ అందించారు.

More News

అజిత్ వాలిమై కొత్త రిలీజ్ డేట్.. పవన్ బరిలోకి దిగితే కష్టమే..!!

ఏ సినిమా చేసినా ప్రాణం పెట్టి చేయడం అజిత్ స్టైల్. తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకడిగా వున్నా... నేటికీ ఆయనలో అదే క్రమశిక్షణ, పట్టుదల. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్‌ చిత్రం ‘వాలిమై’.

విఘ్నాలు దాటుకుని.. ఫిబ్రవరి 18ని లాక్ చేసిన ‘'సన్ ఆఫ్ ఇండియా'

హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, నిర్మాతగా, విద్యావేత్తగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంచు మోహన్ బాబు. అడపా దడపా గెస్ట్ రోల్స్ చేయడమే తప్పించి..

డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్: మార్చి 11న రాధేశ్యామ్.. స్వయంగా ప్రకటించిన ప్రభాస్

ఆర్ఆర్ఆర్‌ రిలీజ్ విషయంలో క్లారిటీ రావడంతో టాలీవుడ్‌లో పెద్ద కదలిక వచ్చింది. చిన్నా, పెద్దా సినిమాలు ఒకదాని వెంట మరొకటి కొత్త డేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి.

చివరి షెడ్యూల్‌ జరుపుకుంటున్న జీ5 'గాలివాన' వెబ్‌ సిరీస్‌

‘జీ 5’... ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.. ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌ మూవీస్‌ మరియు వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల

'పంచతంత్రం'లో కథా బ్రహ్మ బ్రహ్మానందం క్యారెక్టర్ టీజర్ విడుదల

కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'పంచతంత్రం'.