బన్నీ చిత్రంలో మరదలు?

  • IndiaGlitz, [Wednesday,August 14 2019]

అల్లు అర్జున్ చిత్రంలో అతని మరదలు నిహారిక నటించనుందా? అంటే అవుననే సమాధానం ఫిలిమ్ నగర్ వర్గాల్లో వినపడుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా చిత్రీకరణలో బన్నీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే తన 20వ సినిమా చిత్రీకరణలో బన్నీ పాల్గొనబోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందట.

ఆ పాత్రకు నిహారిక అయితే సూట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించి ఆమెను సంప్రదిస్తే ఆమె కూడా నటించడానికి ఓకే అన్నారని టాక్. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. 'ఆర్య', 'ఆర్య 2' చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 'రంగస్థలం' తర్వాత సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.