జాన్సీ కేసులో కొత్త ట్విస్ట్‌‌లు .. నానీ ఎవరు..!?

  • IndiaGlitz, [Sunday,February 10 2019]

‘పవిత్ర బంధం’ సీరియల్ నటి నాగ జాన్సీ ఆత్మహత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌‌లో జాన్సీ ఉంటున్న ఫ్లాట్‌‌ను పరిశీలించడమే కాకుండా కుటుంబీకులు, ఇరుగుపొరుగు వారిని విచారించడం జరిగింది. ఈ సందర్భంగా జాన్సీ బెడ్రూమ్‌‌లో ఓ డైరీ దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ డైరీనే కేసులో కీలకం కానుందని తెలుస్తోంది. అయితే ఆ డైరీలో ఏముంది..? నిజంగానే ఆ డైరీ నాగ జాన్సీదేనా..? అనే విషయాపై ఆరా తీస్తున్నట్లు పంజాగుట్ట ఏసీపీ ఎర్రబెల్లి విజయ్‌కుమార్‌ మీడియాకు వివరించారు.

ఇంతకీ నానీ ఎవరు..?

ఇప్పటికే సూర్యతేజ చౌదరి వల్లే తన కుమార్తె ఇలా ఆత్మహత్య చేసుకుందని జాన్సీ కుటుంబీకులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా పోలీసులు జరిపిన సోదాల్లో లభ్యమైన డైరీలో మాత్రం ‘నానీ.. ఐ లవ్ యూ.. మిస్ యూ నానీ నువ్వు లేకుండా ఒంటరిగా ఉండలేకపోతున్నా..’ అని రాసి ఉంది. అయితే ఆ నానీ ఎవరు..? సూర్య తేజ్ ముద్దు పేరు నానీనా..? లేకుంటే నానీ అనే వ్యక్తి వేరేనా..? అనే కోణాల్లో పోలీసులు నిగ్గు తేల్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఆధారాలు వస్తాయా..!?

ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న సూర్యతేజ.. త్వరలోనే తాను హైదరాబాద్‌‌కు వస్తానని తన వద్ద ఆధారాలున్నాయని బయటపెట్టి అసలు విషయం వెలుగు చూస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు జాన్సీ ఆత్మహత్యకు తనకెలాంటి సంబంధం లేదని తాము ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పడం గమనార్హం. అంతటితో ఆగని సూర్య.. జాన్సీ చాలా మందితో పరిచయాలున్నాయని చెప్పుకొచ్చాడు. ఆయన హైదరాబాద్‌‌కు వస్తే అసలు విషయాలేంటనేది తెలిసే అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు త్వరలోనే సూర్యను విచారిస్తామని చెబుతున్నారు.

కాల్ డేటా.. ఫోన్ లాక్ కష్టమేనా..!?

ఆత్మహత్య అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెండు ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిలో ఒక ఫోన్ లాక్ ఓపెన్ అవ్వగా.. మరొకటి ఓపెన్ కావట్లేదని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే కాల్ డేటా రికార్డ్స్‌ను తెప్పించి చూస్తున్నామని విజయ్ కుమార్ చెప్పారు. కాగా ఇప్పటికే ఒక ఫోన్‌‌లోని వాట్సాప్ కాల్స్, చాటింగ్‌‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మొత్తానికి చూస్తే.. రెండో ఫోన్ లాక్ ఓపెన్ అయినా.. సూర్యతేజను విచారించినా నిజానిజాలేంటో తేలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా డైరీని నిశితంగా పరిశీలించి దాన్ని బట్టి ముందుకెళ్లినా త్వరగా కేసును ఛేదించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారం ఎప్పుడు తేలుతుందో..? అసలు దోషి ఎవరో..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చేసిన కేసీఆర్

గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు అనగా ఫిబ్రవరి 17న కేబినెట్ విస్తరణ ఉంటుందా..?

నేను సక్సెస్ అయ్యా.. చాలా గర్వంగా ఉంది!

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌‌రెడ్డి పొలిటికల్ జర్నీలో కీలకమైన ‘పాదయాత్ర’ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా మహి వి. రాఘవ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’.

లవర్స్ డే రోజు ఆర్జీవీ సంచలనం.. సడన్ సర్‌ఫ్రైజ్!

ఇదేంటి.. లవర్స్ డే రోజున కొంపదీసి ఆర్జీవీ ఎవరికైనా ప్రపోజ్ చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారా..?

షాకింగ్.. బాబు గుట్టును మోదీ రట్టుచేస్తారా!?

ఆంధ్రప్రదేశ్‌‌ విభజించినప్పుడు పోటాపోటీగా మేం ఇంతిస్తాం... అంతిస్తాం అంటూ అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ పోటాపోటీగా చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

మహేశ్ పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడుతూ దణ్ణం పెట్టిన నమ్రత

టాలీవుడ్ సూపర్‌‌స్టార్ మహేశ్ బాబు త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారు..?  ‘భరత్ అనే నేను’ సినిమాలో సీఎంగా చేసిన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు..?