మోదీ మెచ్చిన ఈ బుడ్డోడు ఎవరబ్బా!?

  • IndiaGlitz, [Tuesday,July 23 2019]

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ బిజిబిజీగా ఉంటారన్న విషయం తెలిసిందే. మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో మీటింగ్‌లు, విదేశీ పర్యటనలు ఇలా నిత్యం బిజీగా ఉండే మోదీ తాజాగా ఓ బుడ్డోడితో ఆడుకున్నారు. బుడ్డోడిని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని సరదాగా ఆటాడించారు. ఇదంతా జరిగింది ఎక్కడో కాదండోయ్ పార్లమెంట్‌లో. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరబ్బా..? అని అందరూ చర్చించుకుంటున్నారు.

‘ఆటాడుకుందాం రా’ బుడ్డోడా!!

మంగళవారం నాడు పార్లమెంట్‌లో ఈ ‘ఆటాడుకుందాం రా’ అనే ఆసక్తికర సంఘటన జరిగింది. బుడ్డోడితో ఆటాడిన తర్వాత ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ బుడ్డోడు ‘స్పెషల్ ఫ్రెండ్‌’ అని మోదీ చెప్పుకొచ్చారు. చిన్నారితో మోదీ సరదాగా గడుపుతున్న ఈ ఫొటోలు బీజేపీ నేతలు, కార్యకర్తలు, నెటిజన్ల మదిని దోచుకున్నాయి. కేవలం రెండు గంటల్లోనే ఈ పోస్ట్‌కు 14 లక్షల మందికిపైగా లైక్‌లు కొట్టడం విశేషమని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫొటోలు చూసి దేశం మొత్తం ఫిదా అవుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరబ్బా..!?

అన్నీ సరే మోదీ సాబ్.. జర ఈ బుడ్డోడు ఎవరో చెప్పండి అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి చూస్తే.. మోదీతోనే ఆడుకున్న ఈ బుడ్డోడు ఎవరై ఉంటారు..? అనే విషయం తెలుసుకోవడానికి చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరేమో క్రికెటర్ రోహిత్ శర్మ కూతురని.. మరికొందరు అమిత్ షా మనవరాలని.. ఇంకొందరు ఉజ్జయినీ ఎంపీ సత్యనారాయణ జఠియా మనవడని కామెంట్లలో చెబుతున్నారు. మొత్తమ్మీద ఇంతకీ ఈ చిన్నారి బుడ్డోడా...? బుడ్డదా..? అనే విషయం కూడా తెలియదు. ఫైనల్‌గా ఎవరనేది తెలుస్తుందో లేదో మరి.

More News

మహేశ్‌తో నటించడం లక్కీ ఏం కాదు.. రష్మిక

సూపర్‌‌స్టార్‌ మహేష్‌ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

ఆ క్రెడిట్ నాది కాదు.. మొత్తం విజయ్, డైరెక్టర్‌దే!! - రష్మిక

టాలీవుడ్‌లో వరుస హిట్‌లతో దూసుకెళ్తున్న కుర్ర హీరో కమ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ బ్యూటీ రష్మికా మందన్నా నటీనటులుగా భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్‌’.

క్రేజీ ప్రాజెక్ట్‌లో విజ‌య్‌

విజ‌య్ అంటే త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌.. లేక తెలుగులో క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌నో కాదు..

మెగా కాంపౌండ్‌లో శ్రీవిష్ణు

శ్రీవిష్ణు.. రీసెంట్‌గా బ్రోచెవారెవ‌రురా సినిమాతో హిట్ కొట్టాడు. ఇది న‌టుడిగా శ్రీవిష్ణు ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర మంచి మార్కుల‌నే సంపాదించుకున్నాడు.

బోయ‌పాటి సినిమా ఆ హీరోతోనా?

మాస్ ప‌ల్స్ తెలిసిన డైరెక్ట‌ర్‌గా బోయ‌పాటికి ఉన్న పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే ఇప్పుడు ఆయ‌న ప‌రిస్థితి భిన్నంగా ఉంది.