మెగా కాంపౌండ్‌లో శ్రీవిష్ణు
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీవిష్ణు.. రీసెంట్గా బ్రోచెవారెవరురా సినిమాతో హిట్ కొట్టాడు. ఇది నటుడిగా శ్రీవిష్ణు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులనే సంపాదించుకున్నాడు. ప్రస్తుతం `తిప్పరా మీసం` సినిమాను చేస్తున్నాడనే సంగతి తెలిసిందే. కాగా.. దీని తర్వాత ఈ హీరో గీతాఆర్ట్స్‌లో మినిమం బడ్జెట్ చిత్రాలను నిర్మించే జి.ఎ 2 పిక్చర్స్ బ్యానర్‌పై సినిమా చేయబోతున్నాడని గుసగుసలు వినపడుతున్నాయి.
బన్నీ వాసు నిర్మాతగా శ్రీవిష్ణు ఓ సినిమాలో నటించబోతున్నాడట. ఈ సినిమాను `పేపర్‌బోయ్` దర్శకుడు జయశంకర్ తెరకెక్కిస్తాడని టాక్. స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుందని, అంతా ఓకే అయితే సినిమాను అనౌన్స్ చేస్తారని టాక్. నారా రోహిత్‌కు క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీవిష్ణు, మెగా కాంపౌండ్‌కు సంబంధించిన గీతాఆర్ట్స్‌లో సినిమా చేయడం విశేషమే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.