జగన్‌‌పై దాడి కేసులో చంద్రబాబుకెందుకు భయం!

  • IndiaGlitz, [Sunday,January 13 2019]

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండటం ఏపీకి చాలా ప్రమాదమని.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వివాదస్పద వ్యాఖ్యలు. ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన కన్నా.. బాబు ఎప్పుడు ఏం చేస్తాడో.. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని.. అసలు ఇలాంటి మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఏపీకి సీఎంగా ఉండటం ప్రమాదాకరమన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని ఆశిస్తే.. 40 ఇయర్స్ ఇండస్ట్రీతో ప్రతి పైసాను దోచుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను జన్మభూమి కమిటీలు, పెదబాబు (చంద్రబాబు), చినబాబు(లోకేశ్) దోచుకున్నారని కన్నా ఆరోపించారు. ఏపీకి ద్రోహం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబేనని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

2019 ఎన్నికల్లో మళ్లీ మోదీనే..
ఐదేళ్ల మోదీ పాలన భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ప్రధాని ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో సింహభాగం ఏపీకి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కోసం మోదీ తీసుకున్న చర్యలు ఇంతవరకూ ఎవరూ తీసుకోలేదు అని ఈ సందర్భంగా కన్నా చెప్పుకొచ్చారు.

జగన్‌పై దాడి కేసులో బాబు భయమెందుకు!?
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డిపై జరిగిన దాడిలో చంద్రబాబు ప్రమేయం ఉందిని.. అందుకే ఆయన భయపడుతున్నారన్నారు. వైఎస్ జగన్ కేసులో ఎన్ఐఏ ఎందుకు కలుగజేసుకుంటోందని ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసి మరీ కన్నా విమర్శలు గుప్పించారు. జగన్‌పై దాడి జరిగింది ఎయిర్ పోర్టులో కనుక కేంద్రానికే తప్ప తమకేమీ సంబంధం లేదని ఒకప్పుడు చెప్పిన చంద్రబాబు.. యూటర్న్ తీసుకుని ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎంక్వయిరీ చేస్తోందంటూ.. తప్పు చేయనప్పుడు భయమెందుకు అని కన్నా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వమని అడిగితే.. ఎన్ఐఏ ఎవరని..? అసలు ఈ కేసుకు ఎన్ఆర్ఐ ఎవరని గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయాలను ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలని కన్నా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

కాగా.. ఎన్టీఏ నుంచి బయటికొచ్చినప్పట్నుంచి టీడీపీ-బీజేపీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే రీతిలో పరిస్థితులున్నాయి. ఒకరి మాటలపై మరొకరు కౌంటర్ల వర్షం కురిపించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఓ వైపు తామింత చేశాం.. అంత చేశామని టీడీపీ చెబుతుండగా.. ఏపీకి సింహ భాగం కేంద్రం నుంచి వచ్చిన నిధులేనని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసి అంతంత మాత్రమే సీట్లు సంపాదించుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఎవరితో కలిసి పనిచేస్తుందో వేచి చూడాలి.

More News

జగన్, చంద్రబాబులను ఏకిపారేసిన పవన్..

2014 ఎన్నికల్లో టీడీపీ మద్దతిచ్చి తప్పు చేశానని తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..

చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు!

ఏపీలో రాజకీయాలు ఎంత రసవత్తరంగా ఉంటాయో కొత్తగా చెప్పనక్కర్లేదు.

హీరాణీ లైంగికంగా వేధించారంటున్న మ‌హిళ‌

దేశంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన రాజ్‌కుమార్ హీరాణి..

ర‌ణ‌వీర్‌తో న‌టించ‌లేద‌న్న దీపిక... 

1983లో ఇండియాకు క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను సాధించి పెట్టిన క‌పిల్ సేన జ‌ర్నీ ఆధారంగా `83` సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు.

బాల‌య్య సినిమాపై అనిల్‌రావిపూడి స్పంద‌న‌...

నంద‌మూరి బాల‌కృష్ణ 100వ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించాల్సింది. బాల‌కృష్ణ‌కు అప్ప‌ట్లో అనిల్ రావిపూడి చెప్పిన లైన్ కూడా న‌చ్చింది.