బాలయ్య సినిమాపై అనిల్‌రావిపూడి స్పందన...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ 100వ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాల్సింది. బాలకృష్ణకు అప్పట్లో అనిల్ రావిపూడి చెప్పిన లైన్ కూడా నచ్చింది. అయితే చివరకు క్రిష్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో బాలయ్య తన 100వ చిత్రంగా `గౌతమిపుత్ర శాతకర్ణి` సినిమా చేశాడు. ఇప్పుడు ఆ సంగతిని పక్కన పెడితే బాలకృష్ణ, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఇంకా రూపొందే అవకాశమే ఉందని అనిల్ రావిపూడి అంటున్నాడు.
బాలకృష్ణ లైన్ విని.. బావుంది, తప్పకుండా చేద్దామని అన్నాట్ట. ఆ సినిమా రూపొందే అవకాశాలున్నాయని, అయితే బాలయ్య, బోయపాటి సినిమా తర్వాతే ఉండే అవకాశాలున్నాయంటున్నాడు అనిల్. ప్రస్తుతం `యన్.టి.ఆర్ మహానాయకుడు` ప్యాచ్ వర్క్‌లో బిజీగా ఉన్న బాలయ్య.. తదుపరి తన స్వంత బ్యానర్ ఎన్.బి.కె.ఫిలింస్‌లో బోయపాటితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.