బ‌న్నీ 19 విడుద‌ల అప్పుడేనా?

  • IndiaGlitz, [Wednesday,May 22 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ చివ‌రి వారంలో చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది. త్వ‌ర‌లోనే రెండో షెడ్య‌ల్ ప్రారంభం కానుంది.

లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. సాధార‌ణంగా సంక్రాంతి రేసులోకి స్టార్ హీరోలు పోటీ ప‌డ‌తారు. ఇప్ప‌టికే ఈ రేసులో బాల‌య్య పేరు, ర‌జ‌నీకాంత్ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతున్నాయి. ఈ రేసులో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చేర‌బోతున్న‌ట్లు టాక్‌. మ‌రి దీనిపై యూనిట్ వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఈ చిత్రానికి నాన్న నేను, పార్థు అనే టైటిల్స్ ప‌రిశీలన‌లో ఉన్నాయ‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

'సాహో' సెన్సేష‌న్‌

బాహుబ‌లితో తెలుగు సినిమా రేంజ్ ప్ర‌పంచ స్థాయికి చేరింది. టైటిల్ పాత్ర‌లో న‌టించిన ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెరిగింది. అయితే త‌దుప‌రి  ప్ర‌భాస్ ఏ సినిమాలో న‌టిస్తాడ‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

కౌంటింగ్‌కు ముందు విపక్షాలకు షాకిచ్చిన ఈసీ

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా రేపు కౌంటింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి.

మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభమయ్యేది ఆ రోజునే...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇండియా లేడు. `మ‌హ‌ర్షి` స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటూ సమ్మ‌ర్‌వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈయ‌న త‌దుప‌రి చేయ‌బోయే 26వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు...

టీవీ9 వివాదం పై రవిప్రకాష్ సంచలన వీడియో విడుదల

టీవీ9 వివాదంలో రవిప్రకాష్‌కు పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా పోలీసు బృందాలు ఆయనకోసం గాలిస్తున్నారు.

లో దుస్తులు క‌న‌ప‌డేలా శ్రియ డ్యాన్స్‌

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా తెలుగు, త‌మిళంలో రాణించిన హీరోయిన్ శ్రియాశ‌ర‌న్‌. బాలీవుడ్‌లో కూడా ఈ అమ్మ‌డు ఒక‌ట్రెండు సినిమాల్లో న‌టించింది.