close
Choose your channels

తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగవుతుందా..!?

Thursday, June 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగవుతుందా..!?తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగు కానుందా..? టీడీపీకి పట్టిన గతే కాంగ్రెస్‌కు పట్టనుందా..? నేతలందరూ కాంగ్రెస్‌కు హ్యాండిచ్చేస్తారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అసలు కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు..? ఆఖరికి కాంగ్రెస్‌లో ఎంతమంది మిగులుతారు..? అనేదానిపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా చర్చజరుగుతోంది.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో మొత్తం 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే ఫలితాల తర్వాత ఒక్కరు.. ఇద్దరు.. కాదు ఏకంగా ఇప్పటి వరకూ 12 మంది టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయితే ఇక కాంగ్రెస్‌కు మిగిలింది కేవలం ఆరుగురు మాత్రమే. అందులోనూ ఫైలట్ రోహిత్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య, సీతక్క పార్టీ మారతారని పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రోహిత్ రెడ్డి కలిశారు. పార్టీలో చేరిక విషయమై రెండ్రోజుల్లో క్లారిటీ ఇస్తానని ఆయన తేల్చేశారు. అయితే ఫైలట్ చేరిక దాదాపు ఖరారు అయినట్లేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ పార్టీ మార్పు విషయాన్ని ఫైలట్ కూడా ధృవీకరించారు.

మిగిలేదెవరు..!?
కాగా.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మిగిలేది ఐదుగురే. దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, జగ్గారెడ్డిలే. అయితే ముందస్తు ఎన్నికల్లో హుజూర్ నగర్‌ నుంచి పోటీచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో అసెంబ్లీ సీటు ఖాళీ అయ్యింది. కాగా.. ఇక్కడ్నుంచి పోటీచేయడానికి కాంగ్రెస్ నేతలు ఎవరూ సాహసించట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వీలీన మంత్రం వర్కవుట్ అవుతుందా!
కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉండటంతో కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని (CLP) కూడా టీఆర్ఎస్ శాసన సభా పక్షంలో విలీనం చేసేందుకు అధికార పార్టీ రంగం సిద్ధం చేసుకుంది. మరికొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతుండటంతో మొత్తం శాసన సభా పక్షాన్నే టీఆర్ఎస్‌లో విలీనం చేసేసుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే..
సాంకేతికంగా సీఎల్పీ విలీనం సాధ్యం కాదని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.

కేటీఆర్ విందు..
ఇదిలా ఉంటే.. కారెక్కే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విందు ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము పార్టీ మారుతున్నట్లు నేతలు చెబుతున్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెబుతున్నారు.

అసెంబ్లీ ఎదుట ధర్నా..
టీఆర్ఎస్ పార్టీలో సీఎల్పీని విలీనం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రాహం ఎదుట కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ నిరసనకు దిగారు. అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు కన్నెర్రజేస్తున్నారు.

మొత్తానికి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇదే పరిస్థితి కానీ కంటిన్యూ అయితే టీడీపీకి పట్టిన గతే కాంగ్రెస్‌కు కూడా పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సో.. మున్ముంథు పరిస్థితులు ఎలా ఉంటాయో..? నేతలు జంప్ కాకుండా కాంగ్రెస్ ఏ మాత్రం అడ్డుకట్ట వేస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.