బిగ్‌బాస్ 3లో నాగ్...?

  • IndiaGlitz, [Tuesday,March 19 2019]

హిందీ నుండి తెలుగులోకి వ‌చ్చిన తొలి రియాలిటీ షో బిగ్ బాస్‌. స్టార్ మా వారు నిర్వ‌హిస్తున్న ఈ రియాలిటీ షో ఇప్ప‌టికి రెండు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది. తొలి సీజ‌న్‌లో ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తే.. బిగ్‌బాస్ 2కి నాని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించాడు.

అయితే ఇప్పుడు రెండో సీజ‌న్‌లో ఎదురైన ప‌రిస్థితుల దృష్ట్యా నాని మూడో సీజ‌న్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించలేనని చెప్పారు. ఇక ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్‌' షూటింగ్ కార‌ణంగా బిగ్‌బాస్ సీజ‌న్ 3లో పార్టిసిపేట్ చేయ‌లేనని చెప్పేశాడు. దీంతో నిర్వాహ‌కులు బిగ్‌బాస్ 3ని ఎవ‌రితో హోస్ట్ చేయించాలా?  అని ఆలోచిస్తున్నారు.

అయితే 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' ప్రోగాంను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేసిన నాగార్జున వారికి బెస్ట్ అప్ష‌న్‌గా క‌న‌ప‌డుతున్నారు. దాంతో నిర్వాహ‌కులు నాగార్జున‌ను ఓప్పించే ప‌నిలో ఉన్నారు. ఎలాగూ నాగార్జున త‌న స్వంత సినిమాల్లోనే న‌టిస్తున్నారు.. క‌నుక డేట్స్ స‌మ‌స్య రాక‌పోవ‌చ్చు. 

More News

తెలుగులో రీమేక్ కానున్న బాలీవుడ్ చిత్రం...

గ‌త ఏడాది అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'బ‌దాయి హో'. 30 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ  సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద స‌క్సెస్‌

అమ్మాయికి మంచి జీవితాన్ని ఇస్తా...

మంచు మోహన్ బాబు పుట్టిన‌రోజు నేడు. ఈ రోజును పుర‌స్క‌రించుకుని ఆయ‌న రెండో త‌న‌యుడు మంచు మ‌నోజ్ ఓ మంచి ప‌నికి శ్రీకారం చుట్టాడు. సిరిసిల్ల గ్రామానికి చెందిన అశ్విత

ఆలియా క‌ల నిజ‌మాయే

తొమ్మిదేళ్ల వ‌య‌సులో మహేష్ భ‌ట్ కుమార్తె ఆలియా భ‌ట్ సంజ‌య్ లీలా భ‌న్సాలి ఆఫీసులోకి అడుగు పెట్టింది. అప్ప‌టి నుండి ఆయ‌న సినిమాల్లో న‌టించాల‌ని క‌ల‌లు కంది.

రెండు స్థానాల్లో పవన్ పోటీ.. ప్రకటించిన జనసేన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సేమ్ టూ సేమ్ ‘అన్నయ్య’ రెండు స్థానాల్లో పోటీచేస్తారని ముందుగా లీకులొచ్చాయి.

ఆమిర్‌ఖాన్‌కు ఆ పాత్ర చేయాల‌నుంద‌ట‌...

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమీర్‌ఖాన్ ప్ర‌స్తుతం త‌దుప‌రి సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు.  హాలీవుడ్ చిత్రం `ఫారెస్ట్ గంప్స్‌`ను `లాల్ సింగ్ చ‌ద్దా` పేరుతో రీమేక్ చేస్తున్నాడు.