మహేశ్ సినిమాలో రేణు .... ఖండిస్తుందా..?‌

  • IndiaGlitz, [Tuesday,January 05 2021]

సూపర్‌స్టార్ మ‌హేశ్ చిత్రంలో ప‌వ‌న్ మాజీ స‌తీమ‌ణి రేణు దేశాయ్ న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల మేర‌కు.. మ‌హేశ్ 27వ చిత్రంగా ప‌రశురాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ‘స‌ర్కారువారి పాట‌’ ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభం కానుందనే సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రేణు దేశాయ్ మ‌హేశ్ వ‌దిన పాత్ర‌లో న‌టిస్తుంద‌ని టాక్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇంత‌కు ముందు కూడా రేణు దేశాయ్‌.. ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రంలో న‌టిస్తుంద‌ని న్యూస్ వ‌చ్చింది. అప్ప‌ట్లో రేణు దేశాయ్ ఆ వార్త‌ల‌ను ఖండించింది. త‌న‌ను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని చెప్పింది. మ‌రోసారి ఇప్పుడు ఆ వార్తే మ‌ళ్లీ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మ‌రి ఈసారి మ‌ళ్లీ ఖండిస్తుందేమో చూడాలి. ఒక‌వేళ రేణుదేశాయ్ సైలెంట్‌గా ఉండిపోతే మాత్రం వార్త నిజ‌మ‌నే అనుకుంటారు.

కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న‘స‌ర్కారువారి పాట‌’ చిత్రం మైత్రీ మూవీ మేక‌ర్స్ , 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్ నిర్మిస్తున్నాయి. కోవిడ్ ప్రభావం కారణంగా ఇండియాలో చిత్రీకరించాల్సిన సన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తారు. ఏప్రిల్‌లో యుఎస్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు.

More News

‘శుభలగ్నం’ రీల్ సీన్.. రియల్‌ లైఫ్‌లో రిపీట్.. 15 కోట్లకు డీల్!

ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా ఉన్న ఎస్వీ కృష్ణారెడ్డి అందరికీ గుర్తుండే ఉంటారు.

హాట్ యాంక‌ర్‌కి అంత‌క‌న్నా చిన్న‌వి దొర‌క‌లేదా?

ఆ హాట్ యాంక‌ర్‌కి అంత‌క‌న్నా చిన్న‌వి దొర‌క‌లేదా?  ఆమె ట్రై చేయ‌లేదా?  లేకుంటే చేసినా లేవ‌న్నారా?

పవన్ సరసన కియారా.. మహేశ్‌ మూవీలో రేణు!

టైటిల్‌ చూడగానే కాస్త విచిత్రంగా ఉంది కదూ.. అవును మీరు వింటున్నది నిజమేనట. గత నాలుగైదు రోజులుగా ప్రముఖ వెబ్‌సైట్లలో, నెట్టింట్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

మళ్లీ బీజేపీలోకి జీవిత.. ఇంకెన్నిసార్లో!?

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్, జీవిత దంపతులు ఇప్పటి వరకూ ఎన్ని రాజకీయ పార్టీలు మారారో బహుశా వాళ్లకే గుర్తుండదేమో.

సీన్ రివర్స్.. టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే!

టైటిల్ చూడగానే.. ఇదేంటి సీన్ అంతా రివర్స్‌గా ఉందని ఆశ్చర్యపోతున్నారు కదూ.. అవును మీరు వింటున్నది నిజమే.