'యముడికి మొగుడు'కి 30 ఏళ్ళు

  • IndiaGlitz, [Sunday,April 29 2018]

ధర్మాన్ని పాటించే యమధర్మరాజు తప్పు చేస్తే ఎలా ఉంటుంది అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమే 'యముడికి మొగుడు'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, రాధ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా నటించారు. 'పసివాడి ప్రాణం' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత.. మళ్ళీ చిరు కెరీర్‌లో అటువంటి హిట్‌ని అందించిన మూవీ ఇది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్‌లో చిరు ద్విపాత్రాభినయం చేశారు. విచిత్రగుప్త పాత్ర ద్వారా యమలోకంలో కొత్త పాత్రను ప్రేక్షకులకి పరిచయం చేసిన ఘనత దర్శకుడిదే.

అలాగే.. మనిషిని పోలిన మనుషులు ఆరుగురుంటారనే నానుడిని యమధర్మరాజు చేసిన తప్పుకి రెమిడీగా బాగా వాడుకున్నారు. ఇక ఆకాశ‌మే హ‌ద్దు అన్న‌ట్టుగా చిరు.. త‌న‌ నటన, డాన్స్, ఫైట్స్, కామెడీలతో చేసిన సందడి అంతా ఇంతా కాదు. మొత్త‌మ్మీద‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ అడ్రస్‌గా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు.

అలాగే రాధ, విజయశాంతి గ్లామర్‌కే ప‌రిమితం కాకుండా.. న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లో మెప్పించారు. ఒక కమర్షియల్ మూవీకి ఎటువంటి సంగీతం కావాలో అటువంటి సంగీతాన్ని పాటల రూపంలో అందించి సినిమాకి నూటికి నూరు శాతం న్యాయం చేశారు మ్యూజిక్ డైరెక్టర్స్ రాజ్ కోటి. డైనమిక్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ  ఏప్రిల్ 29, 1988న రిలీజై.. నేటితో 30 సంవత్సరాలను పూర్తి చేసుకుంటోంది. 

More News

ర‌వితేజ హీరోయిన్ వైపే మొగ్గు చూపుతున్న రామ్‌

ఎన‌ర్జిటిక్‌ స్టార్ రామ్ హీరోగా పి.ఎస్‌.వి. గ‌రుడ‌వేగ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

వెంకీతో కామెడీ చేయ‌నున్న అన‌సూయ‌

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా  'ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' పేరుతో ఓ మల్టీస్టారర్ మూవీ  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో సుమంత్‌

గత ఏడాది విడుద‌లైన‌ 'మళ్ళీ రావా' చిత్రం విజయంతో మ‌రోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కేసారు హీరో సుమంత్. ఆ చిత్రంలో కార్తీక్‌గా సుమంత్ నటన పలువురి ప్రశంసలు అందుకుంది.

పారితోషికం తీసుకోకుండా నటిస్తున్న సమంత

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యు టర్న్'. రెండేళ్ళ క్రితం కన్నడంలో విడుదలైన 'యు టర్న్' మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.

ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా..'ఈ నగరానికి ఏమైంది'

'పెళ్ళి చూపులు'తో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డులు కూడా సొంతం చేసుకుంది.