close
Choose your channels

ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా..'ఈ నగరానికి ఏమైంది'

Saturday, April 28, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'పెళ్ళి చూపులు'తో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డులు కూడా సొంతం చేసుకుంది.

తాజాగా ఈ యువ ద‌ర్శ‌కుడు.. అంతా కొత్త నటీనటులతో 'ఈ నగరానికి ఏమైంది' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో విశ్వక్, అనీషా ప్రధాన పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమా స్పెషల్ షోను పరిశ్రమలోని కొంతమంది ప్రముఖుల కోసం ప్రదర్శించారట.

వారు ఈ చిత్రాన్ని చూసి కథ, కథనం అద్భుతంగా ఉందనీ.. ఇంటర్వెల్ బాంగ్ కొత్తగా, ఆకట్టుకునే విధంగా ఉందనీ.. తొలిసారిగా ఇటువంటి ఇంటర్వెల్ బాంగ్‌ను చూసామని అంటూనే.. సినిమాని బాగా తీశావని అభినందించారట. ప్రముఖులకు ఈ సినిమా నచ్చడంతో.. ఈ సినిమా విజయంపై దర్శకుడు తరుణ్ భాస్కర్ చాలా ధీమాగా ఉన్నారని సమాచారం. మ‌రి.. ద‌ర్శ‌కుడిగా త‌రుణ్ ద్వితీయ విఘ్నాన్ని అధిగ‌మిస్తారో లేదో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.