రఘురామ విషయంలో వైసీపీ కీలక నిర్ణయం.. రేపు ఢిల్లీకి ఎంపీలు

వైసీపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా ఇటీవల ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అనంతరం వైసీపీ తరుఫున ఎంపీ విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు పంపించడం.. దానికి ప్రశ్నలనే రఘురామ కృష్ణరాజు సమాధానంగా పంపించడం శరవేగంగా జరిగిపోయాయి. అనంతరం రఘురామ కృష్ణరాజు మరో అడుగు ముందుకేసి.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.

అనంతరం వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు లేఖ కూడా రాశారు. అయితే ఆ లేఖపై జగన్ మాత్రం ఏమీ స్పందించలేదు. కాగా... వైసీపీ తరుఫున ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు వైసీపీ ఎంపీలు.. న్యాయ నిపుణులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరనున్నారు. మరి దీనిపై స్పీకర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More News

కరోనా గురించి గుడ్ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ స్తంభించిపోయేలా చేసింది.

రష్యాకు 50 వేల కేసుల దూరంలో భారత్

కరోనా మహమ్మారి గత కొద్ది రోజులుగా ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలను చూస్తే అర్థమవుతుంది.

కరోనాతో బాధపడుతూ.. ధైర్యం చెబుతున్న ‘నా పేరు మీనాక్షి’ ఫేమ్

కరోనా మహమ్మారి కారణంగా రెండు నెలల పాటు షూటింగ్‌లు నిలిచిపోయాయి.

ఈ సమయంలో కూడా ఇలానా..? రివ్యూవర్స్‌పై రఘు కుంచె ఫైర్

కరోనా కారణంగా ఒకరకంగా ప్రపంచమే స్తంభించిపోయింది. దీనిలో భాగంగానే సినీ పరిశ్రమ కూడా మొత్తంగా స్తంభించిపోయింది.

మహేష్‌ను సౌత్ ఇండియాలోనే టాప్‌లో నిలిపిన అభిమానులు

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్‌బాబుకి ప్రత్యేక స్థానముంది. ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.