లీక్స్ కాకుండా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న జగన్

  • IndiaGlitz, [Wednesday,January 16 2019]

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తూ పూర్తిగా ఎలక్షన్ మూడ్‌లో పడిపోయాయి. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాన్ని ఎలాగైనా సరే మళ్లీ దెబ్బ కొట్టాలని భావిస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మేనిఫెస్టోకు ముందు ప్రకటనలు చేస్తూ హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లోని ‘ రెండువేల రూపాయిల పెన్షన్’‌ను కాపీ కొట్టి ఫిబ్రవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. అయితే ఇది వైసీపీ నుంచి కాపీ కొట్టారా..? లేకుంటే స్వతహాగా ఆలోచించి ఇలా చేశారా అన్నది ఇక్కడ అప్రస్తుతం.

ఇప్పటి వరకూ అటు అధికార టీడీపీ.. ఇటు ప్రతిపక్ష వైసీపీ ఇంత వరకూ మేనిఫెస్టో ప్రకటించనే లేదు. కాబట్టి ఒకరి పథకాలు మరొకరు కాపీ కొట్టినా పెద్దగా నష్టమేమీ లేదు. చంద్రబాబు ఎలాగూ కాపీ కొట్టింది మన పథకాన్నే కదా..? దాంతో పోయేదేముంది.. త్వరలో రిలీజ్ చేయనున్న మేనిఫెస్టో విషయంలో మరింత జాగ్రత్త పడాలని తన పార్టీ కీలక నేతలతో, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచనలు చేశారని సమాచారం. ఆ మేనిఫెస్టో వివరాలు బయటికి పొక్కనియకుండా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తోందట వైపీపీ అధిష్టానం. మరీ ముఖ్యంగా పొరపాటున కూడా మేనిఫెస్టోకు సంబంధించి మూడో వ్యక్తితో మేనిఫెస్టో గురించి పంచుకోవడం.. ఫ్యామిలీతో కూడా చర్చించొద్దని గట్టిగా పార్టీ నేతలకు జగన్ చెప్పారట.

మొత్తానికి చూస్తే బాబు పెన్షన్ ఎఫెక్ట్‌తో అలెర్టయిన జగన్ పక్కా వ్యహంతో ముందుకెళ్తున్నారనే చెప్పుకోవచ్చు. అయితే రెండు వేల రూపాయిల పెన్షన్ వ్యవహారంపై వైసీపీ మరో ప్రకటన చేస్తుందని.. సమాచారం. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పెన్షన్‌‌పై పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తూ.. చంద్రబాబు ఫ్లెక్సీలకు ‘పెద్ద’లతో పాలాభిషేకం చేస్తున్నారు. అయితే టీడీపీ, వైసీపీ మేనిఫెస్టోలో ఏమేం ప్రకటన చేయబోతున్నారన్నది సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ మేనిఫెస్టోలో ఏమేం హామీలిస్తారో..? జనం ఎవరికి ఓట్లేసి గెలిపిస్తారో తెలియాలంటే మరో రెండు నెలు వేచి చూడాల్సిందే.

More News

టికెట్ ఇచ్చేది లేదని మంత్రికి తేల్చిచెప్పిన చంద్రబాబు

ఇప్పటికే ఆమెకు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా అదే ఫ్యామిలీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న సోదరుడికి టికెట్ ఇచ్చి దగ్గరుండి చంద్రబాబు గెలిపించారు.

కూల్ బ్రో చిల్.. అంటున్న మంత్రి నారా లోకేశ్!

టైటిల్ చూడగానే జబర్దస్త్ యోధా.. 'చిల్ బేబీ.. సెల్ఫీ' అనే డైలాగ్ గుర్తొచ్చింది కదూ.. అవును అది యోధా రీల్ డైలాగ్ అయితే.. మంత్రి నారా లోకేశ్ మాత్రం రియల్ లైఫ్‌‌లో 'కూల్ బ్రో చిల్' అంటున్నారు.!

గాడిద పాలతో చేసిన సబ్బు కోసం జనం పోటెత్తారు

'గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు' అని వేమన చెప్పిన పద్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆ పద్యం ఇప్పుడు రివర్స్‌లో చదువుకోవాల్సిన రోజులొచ్చాయి.

ర‌జ‌నీకాంత్‌తో కీర్తి

సంక్రాంతి విడుద‌లైన 'పేట' త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త్వ‌ర‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

నిశ్చితార్థం చేసుకున్న 'మిర్చి' భామ‌

లీడ‌ర్‌, నాగ‌వ‌ల్లి, మిర‌ప‌కాయ్‌, సారొచ్చారు, మిర్చి, భాయ్ సినిమాల్లో న‌టించి ఆక‌ట్టుకున్న రిచాగంగోపాధ్యాయ భాయ్ సినిమా త‌ర్వాత ఎం.బి.ఎ చ‌దువుకోడానికి సినిమాల‌కు దూరమైంది.