వైఎస్ జగన్ 15 కోట్లిచ్చారు.. వైసీపీ అభ్యర్థి షాకింగ్ కామెంట్స్!

  • IndiaGlitz, [Saturday,August 10 2019]

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కనివినీ ఎరుగని రీతిలో విజయదుందుభి మోగించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. 151 మంది ఎమ్మెల్యే స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇప్పటివరకూ ఓడిన నేతలు జగన్ గురించి మాట్లాడలేదు. అయితే పశ్చిమగోదావరి జిల్లా ఉండి వైసీపీ అభ్యర్థి పీవీఎల్‌ఎన్‌ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. అంతేకాదు సొంత పార్టీనే ఇరుకున పెట్టే వ్యాఖ్యలు రాజు చేయడం కలకలం రేపుతున్నాయి.

అసలేమన్నారు..!?

2019 ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని అనుకోలేదు. మా అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పిలిపించి మరీ పోటీ చేయాలని కోరారు. అందుకే నేను ఉండి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాను. నేను ఓడిపోయినప్పటికీ ప్రజలకోసం పనిచేస్తున్నాను. ఉదయం క్యారియర్‌ తెచ్చుకొని సాయంత్రం వరకు నియోజకవర్గంలో పనిచేస్తున్నాను. నా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాను. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌ నుంచి రూపాయి కూడా తీసుకోలేదు అని ఈ సందర్భంగా రాజు స్పష్టం చేశారు.

ఇదీ అసలు కథ..!

అంతటితో ఆగని ఆయన.. ఉండి పక్క నియోజకవర్గాలకు రూ.15 కోట్లు చొప్పున జగన్‌ ఇచ్చారని సొంత పార్టీపైనే షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు.. అభ్యర్థులు డబ్బులు తీసుకున్నా తానుమాత్రం ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని.. ప్రజలకోసం నిస్వార్థంగా పనిచేస్తున్నానని రాజు వ్యాఖ్యానించారు. అయితే రాజు ఎందుకిలా అన్నారు..? ఓడిపోయానన్న ప్రస్టేషన్‌తో ఇలా అన్నారా..? లేకుంటే పార్టీ మారడానికే సొంత పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారా..? లేకుంటే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ కోసం ఇలా చేస్తున్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

కాగా.. 2019 ఎన్నికల్లో ఉండి నుంచి వైసీపీ తరఫున పోటీచేసిన పీవీఎల్ నర్సింహారాజు.. టీడీపీ అభ్యర్థి మానేత రామరాజు చేతిలో ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి 45% ఓట్లు దక్కించుకోని రామరాజు విజయం సాధించారు. అయితే 38% మాత్రమే వైసీపీ అభ్యర్థికి ఓట్లు పోలయ్యాయి.

More News

ఘోర దుర్ఘటన... 62 మంది  సజీవ దహనం !

ఆఫ్రికా దేశంలోని టాంజానియాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది.

చిన్మయిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిని నెటిజన్స్ టార్గెట్ చేశారు. సాధారణంగా మహిళల సాధికారికత గురించి చిన్మయి ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతుంటుంది.

జనసేన వీడటంపై లక్ష్మీ నారాయణ క్లారిటీ

జనసేన కీలకనేత మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

షాకింగ్ లుక్‌లో రామ్.. ఇందులో నిజమెంత!?

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి ఊపు మీదున్న రామ్ పోతినేని.. తదుపరి ఏ చిత్రంలో.. ఎవరి దర్శకత్వంలో తెరకెక్కబోతోందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

`సాహో` ట్రైలర్ రివ్యూ: గల్లిలో కాదు.. స్టేడియంలో కొట్టినోడే..

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం `సాహో`. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.