close
Choose your channels

కన్నుల పండుగగా సాగిన జీ తెలుగు  జీ సినీ అవార్డ్స్‌ 2020

Thursday, January 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కన్నుల పండుగగా సాగిన జీ తెలుగు  జీ సినీ అవార్డ్స్‌ 2020

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అద్భుతమైన సీరియల్స్‌, అదిరిపోయే రియాలిటీ షోస్‌.. అంతకుమించిన సూపర్‌డూపర్‌ హిట్‌ సినిమాలతో అప్రతిహతంగా దూసుకుపోతోంది జీ తెలుగు. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల్ని రంజింపచేస్తున్న జీ తెలుగు, జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమాన్ని కన్నుల పండుగగా, కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీ స్టార్‌ హీరోలు, హీరోయిన్లు హాజరై.. ఈవెంట్‌ని కలర్‌ఫుల్‌గా మార్చేశారు. నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అద్భుతమైన డ్యాన్స్‌లకు వేదికగా మారిన జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమం ఈ శనివారం మరియు ఆదివారం జనవరి 25, 26 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానెల్స్‌లో ప్రసారం కానుంది.

అన్ని అవార్డ్స్‌ ఫంక్షన్స్‌ ఒకేలా ఉండవనడానికి జీ తెలుగు అద్భుతమైన రీతిలో నిర్వహించిన జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమమే మంచి ఉదాహరణ. తెలుగు ఇండస్ట్రీ అతిరథ మహారథులంతా ఈ అవార్డ్స్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. మెగాస్టార్‌ చిరంజీవి ఈ ఈవెంట్‌కే ప్రధాన ఆకర్షణ. ఆయనతో పాటు.. జయప్రద, రామ్‌, సమంత, కార్తికేయ, పూజా హెగ్డే, చార్మీకౌర్‌, రెజీనా కాసాండ్రా, నీల్‌ నితిన్‌ ముకేష్‌, ఖుష్బూ, శ్రద్ధా శ్రీనాథ్‌, అల్లరి నరేష్‌, శివాత్మిక రాజశేఖర్‌, ఆనంద్‌ దేవరకొండతో పాటు ఇతర సినీ సెలబ్రిటీలు హాజరై.. అవార్డ్స్‌ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా మార్చేశారు.

ఈ మధ్యకాలంలో ఎక్కడా విన్నా సిద్‌ శ్రీరామ్‌ పాటలే విన్పిస్తున్నాయి. శ్రీరామ్‌ పాడిన ప్రతీ పాట ట్రెండింగ్‌ అవుతుంది. అలాంటి శ్రీరామ్‌ తొలిసారిగా.. జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమంలో తన పాటలతో అలరించాడు. ఇస్మార్ట్‌ శంకర్‌తో సినిమాలో తన గ్లామర్‌తో కేక పుట్టించిన నిధి అగర్వార్‌ కూడా… అదే సినిమాలోని జిలేలమ్మ జిట్ట పాటకు స్టెప్పులు ఇరగదీసింది. నిధి అగర్వాల్‌తో పాటు హాట్‌ హీరోయిన్స్‌ రెజీనా, మెహ్రీన్‌, హాట్‌ యాంకర్‌ అనసూయ డ్యాన్స్‌ పర్‌ఫార్మెన్స్‌లు అవార్డ్స్‌ కార్యక్రమానికే హైలెట్‌ గా నిలిచాయి. ఇక జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు కార్తికేయ. మెగాస్టార్‌ పాటలకు అద్భుతంగా డ్యాన్స్‌ చేసి, చిరంజీవికి తాను ఎంతటి అభిమానో చెప్పకనే చెప్పాడు కార్తికేయ.

కన్నుల పండుగగా సాగిన జీ తెలుగు  జీ సినీ అవార్డ్స్‌ 2020

అవార్డుల కార్యక్రమం అయినా, మరేదైనా.. పెద్దల్ని గౌరవించుకోవడం మన సంప్రదాయం. ఆ సంప్రదాయానికి అగ్రతాంబూలం ఇస్తూ.. జీ తెలుగు జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్‌ని లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఇక సైరా సినిమాలో అద్భుతమైన నటనకుగాను మెగాస్టార్‌ చిరంజీవి ఉత్తమ నటుడు అవార్డుని అందుకున్నారు. ఓ బేబీ, మజిలి సినిమాల్లో నటనకు సమంత ఉత్తమ నటి అవార్డుని సొంతం చేసుకుంది. ఇక ట్విట్టర్‌ స్టార్‌ అవార్డ్‌ని సొంతం చేసుకున్నారు సూపర్‌స్టార్‌ మహేశ్‌. 2019లో ఎక్కువ ట్వీట్లు చేసిన టాలీవుడ్‌ స్టార్‌ సూపర్‌స్టార్‌ మహేశే మరి.

మెగాస్టార్‌ అప్పియరెన్స్‌, స్టార్‌ హీరోయిన్ల తళుకు బెళుకులు, హాట్‌ హీరోయిన్ల అదిరిపోయే స్టెప్పులతో జీ సినీ అవార్డ్స్‌ 2020 సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఇక ఈ ఈవెంట్‌కు మరో ఆకర్షణ ప్రదీప్‌, రవి, శ్యామల యాంకరింగ్‌. ఈ ముగ్గురు యాంకర్లు స్టేజ్‌పై చేసిన అల్లరి, వేసిన పంచ్‌లు కడుపుబ్బా నవ్వించాయి.

జీ తెలుగు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమాన్ని అస్సలు మిస్ కాకండి. జనవరి 25 మరియు 26, 2020 శనివారం, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి.. మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డి చానెల్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.