1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

కొత్తజంటసెన్సార్ పూర్తి

IndiaGlitz [Saturday, April 26, 2014]
Comments
View Kotha Janta Movie Gallery
View Kotha Janta Movie Gallery

గీతాఆర్ట్స్ బ్యానర్ పై మారుతి దర్శకత్వలో అల్లుశిరీష్, రెజీనా జంటగా తెరకెక్కిన సినిమా 'కొత్తజంట'. బన్నివాసు నిర్మాత. జెబి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవల విడుదలై మంచిటాక్ సంపాదించుకుంది.

ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా 'యు/ఎ' సర్టిఫికేట్ సంపాదించుకుంది. సినిమాని మే 1న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయల సమావేశంలో..

అల్లుఅరవింద్ మాట్లాడుతూ ''సినిమా మే 1న విడుదలౌతుంది. చిత్రయూనిట్, మారుతి సినిమాని అందంగా తీర్చిదిద్దారు. వేసవిలో రేసుగుర్రం అల్రెడి హిట్లయ్యింది. ఈ సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను'' అన్నారు.

 నిర్మాత బన్నివాసు మాట్లాడుతూ ''ఇటీవలే సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికేట్ పొందింది. మే 1న విడుదలకు రెడీ అవుతోంది. మే లో విడుదలైన నా సినిమాలు చాలా వరకు మంచి సక్సెస్ ను సాధించాయి. అదేవిధంగా ఈ సినిమా కూడా  పెద్ద సక్సెస్ ను సాధిస్తుందని నమ్ముతున్నాను'' అన్నారు.

మారుతి మాట్లాడుతూ కొత్తజంట ''నాకు నాల్గవ సినిమా. నా గత చిత్రాల కంటే ఓ మెట్టు నన్ను పైస్థాయిలో నిలిపేలా ఈ సినిమా ఉంటుంది. సమ్మర్ లో వచ్చే ప్రేమకథాచిత్రాలన్నీ పెద్ద సక్సెస్ అవుతాయి. అలాగే ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుంది. శిరీష్ కి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుంది'' అన్నారు.

Watch Kotha Janta Trailers
Shankars assistant comes with a colorful Ship

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.