1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రామయ్యా ఆ సెంటిమెంట్ ప్రకారం

IndiaGlitz [Monday, September 16, 2013]
Comments

కథానాయకుడిగా ఎన్టీఆర్ నటిస్తున్న 22వ చిత్రం 'రామయ్యా.. వస్తావమ్యా'.. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. 'బృందావనం' తరువాత కథానాయకుడు ఎన్టీఆర్, కథానాయిక సమంత, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఛాయాచిత్రాలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాతో తారక్ కి ఘన విజయం దక్కడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

దానికి ఓ సెంటిమెంట్ కూడా ఉందని వారు చెబుతున్నారు. అదేమిటంటే.. ఎన్టీఆర్ గత మూడు చిత్రాలు 'ఊసరవెల్లి', 'దమ్ము', 'బాద్ షా' సినిమాల దర్శకులు సురేందర్ రెడ్డి (2009లో కిక్), బోయపాటి శ్రీను (2010లో సింహా), శ్రీను వైట్ల (2011లో దూకుడు)లు వరుసగా మూడు సంవత్సరాలలో సూపర్ హిట్ ఇచ్చిన వారు కావడం.. ఆయా ఎన్టీఆర్ మూడు సినిమాలు ఫలితాల పరంగా మెరుగ్గా ఉండడం వంటి అంశాలకు... 2012లో గబ్బర్ సింగ్ వంటి ఘన విజయాన్నిచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రామయ్యా రూపొందండం చూస్తుంటే.. తారక్ తాజా సినిమాకి ఘనవిజయం ఖాయమని వారు నమ్మకంగా చెబుతున్నారు. మరి అభిమానులు చెప్పుకొస్తున్న సెంటిమెంట్ ప్రకారం రామయ్యా.. వారు కోరుకుంటున్న ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.
Vijay Sethupathi Passes the Parcel

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sivaji's Romantic Entertainer Underway
 'Chinni Chinni Aasha' A 3 Gen Emotional Journey
 First Pre-Recorded Movie in World Cinema: Singeetham Srinivasa Rao
 'Mondi Mogudu' Coming On 27th September
 Nenem Chinna Pillanaa Censor Certified
 Hari Krishna Of Lakshmi Chitra Passed Away
 Mani Sharma To Rock London
 SIIMA Day 1 Winners List
 Ramoji Rao All Praise For Bahubali Director Rajamouli
 Manasunu Maya Seyake In Sound Mixing
 Nenu Naa Friends With Debutant Director
 Prema Katha Chitram Completes 100 Days
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.