close
Choose your channels

17న 'దిల్లున్నోడు'

Tuesday, May 13, 2014 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
View 'Dillunnodu' Press Meet Gallery
View 'Dillunnodu' Press Meet Gallery

సౌదామిని క్రియేషన్స్ బ్యానర్లో కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో కె.వేణుగోపాల్ నిర్మాతగా జయరవీంద్ర దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా ‘దిల్లున్నోడు’. సాయిరామ్ శంకర్ హీరో. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన ఈ సినిమా ఈ నెల17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..

సమర్పకులు కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘’చిన్న సినిమాలకు ఈ మధ్య శాటిలైట్ బిజెనెస్ కావడం లేదు. కానీ ఈ సినిమా శాటిలైట్ బిజెనెస్ కూడా పూర్తైంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 17న సినిమాని విడుదల చేస్తున్నాం. జయరవీంద్ర అనుకున్న టైమ్, బడ్జెట్ లోనే సినిమాని పూర్తి చేశాడు. సాయిరామ్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తప్పకుండా అందరికి సినిమా నచ్చుతుంది’’ అన్నారు.

హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ ‘’నేను, జయరవీంద్ర కలిసి చేస్తున్న రెండోసినిమా ఇది. మంచి పాయింట్ తో తెరకెక్కింది. అవుట్ పుట్ బాగా వచ్చింది. నాకు మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు.

దర్శకుడు జయరవీంద్ర మాట్లాడుతూ ‘’ఇద్దరి అమ్మాయిలతో ప్రేమాయణం నడిపే కుర్రాడి కథ. సినిమా బాగా వచ్చింది. సినిమా 17న విడుదల అవుతుంది’’ అన్నారు.

బ్రహ్మానందం, చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, కాశీవిశ్వనాథ్, సప్తగిరి, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: వేమారెడ్డి నిర్మాత: కె.వేణుగోపాల్, దర్శకత్వం: జయరవీంద్ర.

Hindi
Telugu
Malayalam
Kannada
Follow
Subscribe

'లింగా' వివాదాస్సదం కానుందా?



Gunturodu Review Live Updates
'లింగా' వివాదాస్సదం కానుందా?