జగన్ వర్సెస్ బాబు : ఏపీ అసెంబ్లీని ఊపేసిన ‘బంట్రోతు’!

  • IndiaGlitz, [Thursday,June 13 2019]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అనుకున్నట్లుగానే వాడివేడిగా జరుగుతున్నాయి. మొదటి రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయగా.. రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక అనంతరం స్పీకర్‌ను సీటులో కూర్చోబెట్టేందుకు ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు రాలేదు.

చంద్రబాబు రాకుండా ఆయన బంట్రోతులను పంపారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం నెలకొంది. ఓ వైపు టీడీపీ సభ్యులు ఆందోళన దిగగా.. మరోవైపు వైసీపీ సభ్యులు మాత్రం కౌంటర్ల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎవరేం మాట్లాడారన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.

చెవిరెడ్డి ఏమన్నారు..!?

స్పీకర్‌ చైర్‌ వరకు చంద్రబాబు రాకుండా బంట్రోతును పంపారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఎంటరై చెవిరెడ్డి ఉద్దేశపూర్వకంగా చెవిరెడ్డి వ్యాఖ్యలు చేయలేదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

గతంలో స్పీకర్ ఎన్నిక విషయంలో టీడీపీ కూడా సంప్రదాయాలను పాటించలేదని.. ప్రతిపక్షాలకు చెందిన వారు రావాలని ప్రొటెం స్పీకర్ ప్రస్తావించారన్నారు. కావాలంటే మరోసారి గత రికార్డ్స్ వినాలన్నారు. బీసీ వర్గాలకు చెందిన వ్యక్తి స్పీకర్ చైర్‌లో కూర్చొంటుంటే చంద్రబాబు రాకపోవడం ఎంత వరకు కరెక్టో ఆలోచించుకోవాలని శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు. అయితే ఇందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ

స్పీకర్ ఎన్నికకు సంబంధించి వైసీపీ సంప్రదాయాలను పాటించలేదని సభలో ప్రస్తావించారు.

చంద్రబాబు స్పందన ఇదీ..!

స్పీకర్‌ ఎన్నికపై మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నన్ను పిలవకుండానే స్పీకర్‌ చైర్‌ స్థానం వరకు ఎలా వస్తాను?. నన్ను పిలవలేదు.. రికార్డులు చూడండి. స్పీకర్‌కు అభినందనలు తెలిపేందుకు అచ్చెన్నాయుడును పంపిస్తే బంట్రోతు అంటూ అహంభావంతో మాట్లాడుతున్నారు. అహంభావంతో వ్యాఖ్యలు చేసినవారు క్షమాపణలు చెప్పాలి అని చంద్రబాబు ఈ సందర్భంగా అసెంబ్లీలో డిమాండ్ చేశారు.

జగన్ రియాక్షన్..

స్పీకర్‌ చైర్‌ వరకు రావాలని చంద్రబాబును ప్రొటెం స్పీకర్‌ కోరారు. ఇదంతా సభ్యులందరి కళ్ల ముందే జరిగింది. తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పిలవలేదు.. శాలువా కప్పలేదంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలో బీసీలకు న్యాయం చేయలేదు. హత్యలు చేసినవాడిని హత్య చేయడం తప్పుకాదన్నట్టుగా చంద్రబాబు తీరు ఉంది.

గతంలో విపక్ష ఎమ్మెల్యేలను చంద్రబాబు పార్టీలోకి చేర్చుకున్నారు. తప్పును ఒప్పుకోకుండా అనవసర విషయాలు చెబుతున్నారు. చంద్రబాబు మాటలు వింటే ఆశ్చర్యంగా ఉంది. అవకాశం ఇస్తే చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ చెప్పిన మాటలను సభలో వినిపిస్తాను అని చంద్రబాబుపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంచ్‌ల వర్షం కురిపించారు

More News

దానికైతే రెడీ అన్న రేణు

రేణు దేశాయ్ బిగ్ బాస్ త్రీలో పార్టిసిపేట్ చేస్తారా?  అవున‌ని కొంద

విశాల్ గోడ‌లు దూకే ర‌కం కాదు

విశాల్ అంత మంచి వ్య‌క్తి కాడ‌నీ, అత‌నికి ఓ యువ‌తితో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని, ఆమెకోసం విశాల్ గోడ‌లు దూకేవాడ‌ని విశ్వ‌ద‌ర్శిని అనే మ‌హిళ చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని తేలింది. చె

మన్మథుడు-2 టీజర్ రివ్యూ: ఐ డోన్ట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌.. ఐ ఓన్లీ మేక్‌ లవ్!

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేశ్ నటీనటులుగా రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. గురువారం నాడు అనగా జూన్-13న మన్మథుడు టీజర్ విడుదలైం

సూర్య–మోహన్‌బాబు కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం

నాయకుడిగా, ప్రతినాయకుడిగా... ఇలా 44 ఏళ్ల నటజీవితంలో ఏ పాత్ర అయినా చేయగలనని మంచు మోహన్‌బాబు నిరూపించుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ ఆయన ఒకే ఒక్క

వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు షరతులు పెట్టిన జగన్!

సీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు షరతులు వర్తిస్తాయ్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు. గురువారం నాడు తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా ఎన్నుకున్నారు.