దానికైతే రెడీ అన్న రేణు
Send us your feedback to audioarticles@vaarta.com
రేణు దేశాయ్ బిగ్ బాస్ త్రీలో పార్టిసిపేట్ చేస్తారా? అవునని కొందరు, చేయరేమోనని మరికొందరు ఇటీవలి వరకు అభిప్రాయపడుతూనే ఉన్నారు. తాజాగా దీని గురించి ఆమే నోరు విప్పారు. తనకు అంత సమయం లేదని స్పష్టం చేశారు. బిగ్ బాస్ త్రీలో పార్టిసిపేట్ చేసే సమయం ఉండదని, కావాలంటే తాను హోస్ట్ గా వ్యవహరిస్తాననీ ఆమె అన్నారు. అయితే ఆమెకు హోస్ట్ గా అవకాశం ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇదివరకు తెలుగులో బిగ్ బాస్‌ను ఎన్టీఆర్, నాని నిర్వహించారు.
తన ఇన్నేళ్ల జీవితంలో నేర్చుకున్నదీ బిగ్‌బాస్ షో నిర్వహణలో నేర్చుకున్నదీ ఒకటేనని నాని అన్నారు. బిగ్ బాస్ షో పూర్తి కావడం బర్డన్ తగ్గినట్టు ఉందని ఆయన అప్పట్లో తెలిపారు. సోషల్ మీడియాలో తరచూ కనిపించే రేణూదేశాయ్ బిగ్‌బాస్ త్రీకి హోస్ట్ గా వ్యవహరిస్తే మరి అన్ని రాజకీయాలను తట్టుకోగలరా అనేది ఆలోచించాల్సిన విషయం. వ్యక్తిగతంగా కూడా ఆమె చాలా బిజీగానే ఉన్నారు. ఓ వైపు స్క్రిప్ట్ రైటింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తితో ఈ ఏడాది పెళ్లిపీటలెక్కే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.