close
Choose your channels

మన్మథుడు-2 టీజర్ రివ్యూ: ఐ డోన్ట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌.. ఐ ఓన్లీ మేక్‌ లవ్!

Thursday, June 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐ డోన్ట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌.. ఐ ఓన్లీ మేక్‌ లవ్! (మన్మథుడు-2 టీజర్ రివ్యూ)

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేశ్ నటీనటులుగా రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. గురువారం నాడు అనగా జూన్-13న మన్మథుడు టీజర్ విడుదలైంది. ఉదయం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో రిలీజ్ కాగా.. మధ్యాహ్నం ఒంటిగంటకు సరిగ్గా ‘మన్మథుడు-2’ రిలీజ్ అయ్యింది.

టీజర్ రివ్యూ..

ముదురు వయసులో ఉన్న నాగార్జున పెళ్లి చుట్టూ ఈ కథను అల్లి చాలా కామెడీగా చూపించారని చెప్పుకోవచ్చు. ఇంత వయసు వచ్చినా ఆయన ఇంకా వర్జిన్‌గానే ఉండటం.. చుట్టూ ఉన్న వాళ్లు ఆయన్ని ఆటపట్టించడం చాలా ఫన్నీగా ఉంది. ఇది టీజర్ ఫస్ట్ పార్ట్‌‌లో మాత్రమే.

ఇక సెకండ్ పార్ట్‌లో మన్మథుడుగా ఒరిజినల్ అవతారంలోకి వచ్చేసి అమ్మాయిలతో రొమాన్స్ పండిస్తూ ముద్దులతో ముంచెత్తుతున్నాడు. 60కి చేరువైనా.. 30కి క్రాస్ అయిన ఇద్దరు కొడుకులూ ఉన్నా నాగార్జున మాత్రం నవమన్మథుడిగానే ఉన్నారు. అయితే ఆయన ఎంతకీ పెళ్లి చేసుకోకపోవడంతో కింగ్‌పై అందరూ పంచ్‌ల వర్షం కురిపిస్తున్నారు.

డైలాగ్స్ అదుర్స్..

1:15 నిమిషాల నిడివి గల ఈ టీజర్‌లో పంచ్‌లు అదిరిపోయాయి. అయితే నాగ్ మాత్రం రెండే డైలాగ్స్‌తో సరిపెట్టుకున్నారు. ‘నీకు షట్టర్లు మూసేసి దుకాణాలు సర్దేసే వయసొచ్చేసింది’ అని దేవదర్శిని నాగ్‌ను ఉద్దేశిస్తూ చెబుతున్న డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది.

ఇలా ఒకరిద్దరు కాదు అందరూ నాగ్‌పైనే పంచ్‌లేశారు. అలాగే ‘పిల్ల‌ల‌కు కోచింగ్ ఇవ్వాల్సిన వ‌య‌సులో బ్యాటింగ్ చేస్తానంటావేంట్రా’ అని రావు ర‌మేష్ చెప్పే డైలాగ్ అదర్స్ అని చెప్పుకోవచ్చు. పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ గ‌డిపేసే వ్య‌క్తిగా నాగ్‌ని చూపించారు. ఎప్ప‌టిలాగానే నాగార్జున చాలా అందంగా, స్టైలిష్‌గా ఉన్నారు.

అయితే హీరోయిన్ల‌ను మాత్రం టీజ‌ర్‌లో పెద్దగా చూపించ‌లేదు. ఈ సినిమా ఆగ‌స్ట్ 9వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. టీజర్‌ చివర్లో నాగ్‌ స్టైల్‌గా.. ‘ఐ డోన్ట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌.. ఐ ఓన్లీ మేక్‌ లవ్’ అని చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే టీజర్‌తో మన్మథుడు అంచనాలు పెంచేశాడని చెప్పుకోవచ్చు. బహుశా ఈ టీజర్ చూసిన వాళ్లు ఈ వయస్సులో నాగ్ ఇంత అందం ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నారబ్బా అని కుళ్లుకోక తప్పదమో మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.